హమ్మయ్య.. కిడ్నాపర్లు దొరికారు

by  |
హమ్మయ్య.. కిడ్నాపర్లు దొరికారు
X

దిశ, వెబ్‌డెస్క్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలో దీపావళి పండగ రోజు కిడ్నాప్ కు గురైన బాలుడి కేసును పోలీసులు చేధించారు. రాష్ట్రంలో వరసగా కిడ్నాప్ కేసులు నమోదు అవుతుండడంతో ఛాలెంజ్ గా తీసుకున్న పేట పోలీసులు 24 గంటల్లో నిందింతులను అదుపులోకి తీసుకోని బాలుడిని క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.

శనివారం రాత్రి బాలుడు గౌతమ్ కిడ్నాప్ అయినట్లు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్ కిడ్నాప్ కేసు దర్యాప్తునకు పలు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కిడ్నాపర్లు బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వని పక్షంలో బాలుడిని చంపుతామని బెదిరించారు.

కిడ్నాపర్ల ఫోన్ కాల్ ఆధారంగా మిర్యాలగూడ వాడపల్లి – గుంటూరు ఆంధ్ర బార్డర్ వద్ద ఉన్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలిసిన వారే కిడ్నాప్ కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కిడ్నాపర్లు అడిగిన డబ్బు ఇస్తామని నమ్మించి వారిని అరెస్ట్ చేశామని ఎస్పీ భాస్కరన్ తెలిపారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారని చెప్పారు. బయటకు వెళ్లిన బాలుడిని బైక్ పై కిడ్నాప్ చేశారన్నారు. అనంతరం మిర్యాలగూడకు తీసుకెళ్లిన నిందితులు రోడ్డుపై వెళ్లే వారి సెల్ ఫోన్లు తీసుకోని బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ బెదింరించారని చెప్పారు. ఆ ఫోన్ల ఆధారంగా కిడ్నాపర్లను అరెస్ట్ చేసి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించామని వివరించారు.



Next Story