నయా ట్రెండ్.. బొంగులో కల్లు..!

by  |
నయా ట్రెండ్.. బొంగులో కల్లు..!
X

దిశ, వెబ్‌డెస్క్ : సృజనాత్మక ఆలోచన ఏదైనా జనాలకు ఇట్టే కనెక్ట్ అవుతుంది. అంతేకాదు ఊహించనంత వేగంగా కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తుంది. అయితే ఎప్పుడు ఏది ట్రెండ్ అవుతుందో చెప్పడం కష్టమే! ఈ క్రమంలో చాలా మంది తమ ఇన్నోవేటివ్ థాట్స్‌తో వండర్స్ క్రియేట్స్ చేస్తూ ట్రెండ్ సెట్టర్‌లుగా నిలుస్తుంటారు. వీటికి తోడు సెలబ్రిటీలు ఆ ట్రెండింగ్‌ అంశంపై ఒక ఫోటో గానీ, కామెంట్ గానీ పెడితో చాలు.. అది ఏదైనా వైరల్ కావాల్సిందే. ఈ కల్చర్ పట్టణాల్లో ఎక్కువగా ఆదరణ పొందుతున్నప్పటికీ.. సోషల్ మీడియా పుణ్యమా! అని ఇప్పుడు మారుమూల గ్రామాల్లోనూ ఇలాంటి ట్రెండ్స్ మారుమ్రోగుతున్నాయి. ఈ క్రమంలో ఫుడ్, లైఫ్‌స్టైల్‌‌కు సంబంధించి ట్రెండింగ్‌ అంశాలపై జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుండగా.. తాజాగా మరో ట్రెండ్ సోషల్ మీడియా ట్రెండింగ్‌లో నిలిచింది. ఆ ట్రెండ్ విశేషాలేంటో తెలియాలంటే రీడ్ దిస్ స్టోరీ.

ట్రెండింగ్ బాటలో గ్రామాలు

గతంలో పట్టణాలకే పరిమితమైన నయా ట్రెండ్.. ప్రస్తుతం మారుమూల గ్రామాలకు విస్తరించింది. దీనికి కారణం సోషల్ మీడియానే అయినా.. ఏదో ఒక ప్రత్యేకత లేకుండా ఏ అంశమైనా ట్రెండ్‌ సెట్ చేయలేదు. కాగా ఈ టెక్ ఎరాలో పల్లెల్లో సహజసిద్ధంగా దొరికే అనేక ఆహార ఉత్పత్తులు.. మోడ్రనైజేషన్‌ను సంతరించుకుని సరికొత్తగా ఆవిష్కరించబడుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలోని పలు మారుమూల గ్రామాల్లో అవంలంబిస్తున్న ఓ కొత్త విధానం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఆకర్షణగా నిలవడమే కాకుండా.. సోషల్ మీడియాలోనూ ఆసక్తిని రేకెత్తించింది. ఈ క్రమంలో పలువురికి ఆదర్శంగా నిలుస్తూ జీవనోపాధి మార్గానికి కొత్త విధానాన్ని పరిచయం చేసింది.

ఇంతకీ ఆ ప్రత్యేకత ఏంటంటే..?

బొంగులో చికెన్ గురించి వినే ఉంటారు. వినడమే కాదు, ఆల్రెడీ టేస్ట్ చేసే ఉంటారు. అంతేకాదు కల్లుతో చికెన్ వండటం గురించి తెలిసే ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఓ ప్రయోగానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా వేదికైంది. అయితే ఇదేదో ఫుడ్ ఐటెమ్ అనుకుంటే పొరపాటే. విషయం ఏంటంటే.. తాటి చెట్ల నుంచి కల్లును తీసేందుకు గీత కార్మికులు చెట్లకు కుండలు ఏర్పాటు చేస్తారన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు వాటికి బదులుగా వినూత్నంగా వెదురుబొంగులు అమర్చుతున్నారు. భూపాలపల్లికి చెందిన గీత కార్మికులు ఈ విధానాన్ని ట్రెండ్ చేస్తున్నారు. బొంగులో తీసిన కల్లు ఇప్పుడక్కడ చాలా ఫేమస్. ఈ కల్లును రుచి చూసేందుకు స్థానికులతో పాటు దూరాభారం లెక్కచేయకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కల్లుప్రియులు వస్తుండటం విశేషం.

తాటి చెట్లన నుంచి వెదురు బొంగుల్లో సేకరించి, కస్టమర్లకు కూడా అలానే సర్వ్ చేస్తున్నారు. దీంతో కల్లు సేవించడం సులభతరం అవడమే కాకుండా.. కొత్త అనుభూతిని ఇస్తోందని కల్లు ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ‘నయా ట్రెండ్.. బొంగులో కల్లు’ అంటూ పలువురు సోషల్ మీడియాలో ఫోటోలు అప్‌లోడ్ చేస్తుండటంతో.. నెటిజన్లు వెదురుబొంగులో కల్లును తాగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రత్యేకంగా ఈ కల్లు కోసమే ఇతర జిల్లాల నుంచి జనాలు వస్తున్నారంటే బొంగులో కల్లు ఎంత ఆదరణ పొందిందో తెలుస్తోంది. దీంతో మీడియా సైతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని బొంగులో కల్లుపై ఫోకస్‌ చేయడంతో.. ఇతర జిల్లాల్లోని గీత కార్మికులు ఇదే విధానాన్ని పాటించేందుకు సిద్ధం అవుతున్నారు. దీంతో గిరాకీ కూడా ఎక్కువగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా నయా ట్రెండ్‌ సృష్టిస్తున్న బొంగులో కల్లు.. గీత కార్మికులకు ఆర్థికంగా చేయూతనివ్వడం అనేది కొసమెరుపు.



Next Story

Most Viewed