viral : తన పిల్లల్ని అలా చేస్తుంటే తట్టుకోలేకపోయిన తల్లి.. చివరికి ఏం చేసిందంటే.. (వీడియో)

by Dishafeatures2 |
viral : తన పిల్లల్ని అలా చేస్తుంటే తట్టుకోలేకపోయిన తల్లి.. చివరికి ఏం చేసిందంటే.. (వీడియో)
X

దిశ, ఫీచర్స్ : అమ్మంటే ప్రేమకు నిలువెత్తు నిదర్శనం, అమ్మంటే త్యాగానికి ప్రతీక, అమ్మంటే బిడ్డలకు పట్టలేని ఆనందం, అమ్మంటే కొండంత ధైర్యం. తరాలు గడిచినా తరగని నిధి వంటిది అమ్మ లాలనలోని వాత్సల్యం. ఇది కేవలం మనుషులకే పశు పక్ష్యాదులు, క్రిమి కీటకాలు.. ఇలా ప్రతి జీవికీ వర్తిస్తుంది. పుస్తకాల్లోనూ, వాస్తవ జీవితంలోనూ అమ్మ ప్రేమను చాటే అనేక కథలు, సంఘటనలు మనం ఎన్నో వింటుంటాం, మరెన్నో చూస్తుంటాం. తాజాగా ‘అమ్మ ప్రేమ’ను చాటే అలాంటి అద్భుత దృశ్యానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అందులో తన బిడ్డలకోసం తల్లి పడే ఆరాటాన్ని, పిల్లలను కాపాడుకునేందుకు చేసే ప్రయత్నాన్ని చూసిన ప్రతీ ఒక్కరూ చలించిపోతున్నారు. తల్లి ప్రేమను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.

అది ఆఫ్రికా దేశంలోని గడ్డి భూములు అధికంగా ఉండే ఫారెస్ట్ ఏరియా. ‘ఆఫ్రికన్ సవన్నా’ అని కూడా పిలుస్తారు. రైతులు, గ్రామీణ ప్రజలు ఈ గడ్డిని వివిధ అవసరాలకు ఉపయోగించడానికి తమ ఇళ్లముందు పందిళ్లు నిర్మించి వాటిపై భద్రపరుస్తుంటారు. మరికొందరు చెట్లపై గడ్డిని పేరుస్తుంటారు. ఇక సవన్నా ప్రాంతంలో తిరిగే పిగ్మీ ఫాల్కన్ అనే పక్షి జాతికి చెందిన పిట్టలు. ఈ గడ్డిలో గూళ్లు కట్టుకొని గుడ్లు పెట్టడం, సంతానాన్ని కనడం చేస్తుంటాయి. పాములు, కీటకాల బారి నుంచి గుడ్లను, తమ పిల్లలను సంరక్షించుకుంటాయి.

అయితే రీసెంట్‌గా అటువంటి సంఘటనే జరిగింది. ఒక చెట్టుపై గల పిట్టగూడులోకి పిగ్మీ ఫాల్కన్ (తల్లి పక్షి) పిల్లలను తినడానికి పాము వస్తోంది. ఇది గమనించిన తల్లి చాలా బాధపడింది. వెంటనే అలర్ట్ అయి తన నోటితో శబ్దాలు చేస్తూ చెట్టుపై గూటిలో గల తన పిల్లలను, మిగతా పిగ్మీ ఫాల్కన్‌లను అలర్ట్ చేసింది. అంతటితో ఊరుకోకుండా తల్లి పిగ్మీ ఫాల్కన్ ప్రాణాలు పణంగా పెట్టి పోరాడింది. పాము తన పిల్లలను సమీపిస్తుండగా ఎగిరి కాళ్లతో తంతూ దానిని పారదోలింది. ప్రస్తుతం ఈ దృశ్యానికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఈ తల్లి పిగ్మీ ఫాల్కన్ పడిన ఆరాటం, ఆవేదన, బాధ నెటిజన్ల హృదయాన్ని కదిలిస్తోంది.

Next Story