టీకా తీసుకున్నారా.. అయితే జాగ్రత్త.. కేంద్రం కీలక ప్రకటన

by  |
టీకా తీసుకున్నారా.. అయితే జాగ్రత్త.. కేంద్రం కీలక ప్రకటన
X

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ వేయించున్న వారికి కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్ వేయించుకున్న 28 రోజుల దాకా రక్తదానం చేయొద్దని సూచించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న నేషనల్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ కౌన్సిల్ (ఎన్‌బీటీసీ) ఈ విషయాన్ని వెల్లడించింది.

ఈ ఆదేశాల ప్రకారం.. రక్తదాతలు కరోనా టీకా తొలి డోసు వేయించుకున్న తర్వాత 56 రోజుల (సుమారు రెండు నెలలు) పాటు రక్తదానం చేయకూడదు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత పూర్తి స్థాయి ఇమ్యునైజేషన్ కోసం 28 రోజుల సమయం పడుతుందని కేంద్ర హోంశాఖ తెలిపిన విషయం తెలిసిందే. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక రెండు వారాల తర్వాత శరీరంలో యాంటిబాడీలు వృద్ధి చెందుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. రక్తదానం చేయకపోవడంతో పాటు టీకా తీసుకున్న తర్వాత కొద్దిరోజుల పాటు మద్యపానం కూడా మానేయాలని హోంశాఖ సూచించింది.



Next Story