తెలంగాణ కాంగ్రెస్‌కు మరో భారీ షాక్

by  |
తెలంగాణ కాంగ్రెస్‌కు మరో భారీ షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: వరుస వలసలతో సతమతమవుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగులనుంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కోలుకోలేని దెబ్బ పడనుంది. శుక్రవారం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామిలు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్య నారాయణను మహేంద్రహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసారు. ఈ సందర్భంగా బీజేపీలో చేరాలని సర్వే సత్యనారాయణను బండి సంజయ్ ఆహ్వానించనున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే విజయశాంతి కమలం గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకోగా, ఇప్పుడు మరో కీలక నేత సర్వే సత్యనారాయణతో బీజేపీ నేతలు చర్చలు జరుపడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.Next Story