విఠలాచార్యకు సత్కారం

by  |
విఠలాచార్యకు సత్కారం
X

దిశ, రామన్నపేట: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య పేరు ప్రస్తావించడం రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని బీజేపీ జిల్లా అధ్యక్షులు పివి శ్యామ్ సుందర్ రావు, రాష్ట్ర కార్యదర్శి దాసరి మల్లేశం అన్నారు. మండలంలోని వెల్లంకి గ్రామంలో సోమవారం కూరెళ్ల విఠలాచార్యను శాలువాతో సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆయన తన ఇంటిని గ్రంథాలయంగా మార్చడం మనకందరికీ గర్వకారణమని అన్నారు. ప్రధాని ప్రశంసించడం సాహిత్య ప్రియుల్లో ఆనందం నింపిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నకిరేకంటి మొగులయ్య, మండల అధ్యక్షుడు తాటిపాముల శివకృష్ణ గౌడ్, గర్దాసు సురేష్, దంతూరి సత్తయ్య, మాడూరి ప్రభాకర్ రావు, వనం అంజయ్య, రాచకొండ కృష్ణ, శానగొండ మల్లికార్జునచారి, పల్లపు దుర్గయ్య, అక్కనిపెళ్లి సైదులు, తాటిపాముల లింగస్వామి, గంజి శ్రీను, వనం హరీష్ తదితరులు పాల్గొన్నారు.


Next Story