దళారులే వ్యతికేస్తున్నారు : డీకే అరుణ

by  |
BJP leader DK Aruna
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో రైతుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కేంద్రం సంస్కరణలు తీసుకొస్తోందని అన్నారు. నూతన వ్యవసాయ చట్టాల వల్ల ఏ ఒక్కరైతుకూ నష్టం జరుగదని స్పష్టం చేశారు. దళారులే రైతుల మేలు కోసం తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. భారత్ బంద్‌లో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తప్ప రైతులు ఒక్కరు కూడా పాల్గొనలేదని విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడే సీఎం కేసీఆర్‌కు రైతులు గుర్తుకొస్తున్నారు అని ఎద్దేవా చేశారు. ప్రధాని ఫసల్ బీమా యోజన రాష్ట్ర రైతులకు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed