- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భైంసాలో ఉద్రిక్తత.. పోలింగ్ బూత్ అధికారులపై ఆర్డీఓకు ఫిర్యాదు
by Chintha Aamani |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల ఉద్రిక్తంగా, మరికొన్ని చోట్ల ప్రశాంతంగా ఈ ఎన్నికల పోలింగ్ సరళి కొనసాగుతోంది. తాజాగా.. నిర్మల్ జిల్లా భైంసాలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. భైంసా పోలింగ్ బూత్ అధికారులపై బీజేపీ కౌన్సిలర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తమ ఓటు ఎలా వేయాలని పోలింగ్ అధికారిని బీజేపీ కౌన్సిలర్లు అడగటంతో, అభ్యర్థి పక్కన టిక్ చేయాలని అధికారి సూచించారు. దీంతో కౌన్సిలర్లు అభ్యర్థి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల ఉద్రిక్తంగా, మరికొన్ని చోట్ల ప్రశాంతంగా ఈ ఎన్నికల పోలింగ్ సరళి కొనసాగుతోంది. తాజాగా.. నిర్మల్ జిల్లా భైంసాలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. భైంసా పోలింగ్ బూత్ అధికారులపై బీజేపీ కౌన్సిలర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తమ ఓటు ఎలా వేయాలని పోలింగ్ అధికారిని బీజేపీ కౌన్సిలర్లు అడగటంతో, అభ్యర్థి పక్కన టిక్ చేయాలని అధికారి సూచించారు. దీంతో కౌన్సిలర్లు అభ్యర్థి పక్కన టిక్ చేశారు. అయితే, అధికారి నిర్లక్ష్యం కారణంగానే తమ ఓటు రిజెక్ట్ అవుతోందని బీజేపీ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ కౌన్సిలర్లు పోలింగ్ అధికారిపై భైంసా ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు.
Next Story






