బయోకాన్ చైర్‌పర్సన్ కిరణ్ మజూందార్‌కు కరోనా

by  |
బయోకాన్ చైర్‌పర్సన్ కిరణ్ మజూందార్‌కు కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: బయోకాన్ వ్యవస్థాపకులు, ఎండీ కిరణ్ మజుందార్ షా కరోనా బారిన పడ్డారు. ‘కరోనా కేసుల జాబితాలో నేను కూడా చేరాను. అయితే, తనకు లక్షణాలు తక్కువే ఉన్నాయని, త్వరలో కోలుకుంటానని’ ఆమె ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. కిరణ్ మజుందార్ షాకు కరోనా అని తెలియగానే ప్రముఖులు కొందరు ఆమె త్వరగా కోలుకోవాలని స్పందించారు.

దేశీయ దిగ్గజ తయారీ కంపెనీ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. కిరణ్ మజుందార్‌కి కరోనా రావడంపై ఆందోళనేమీ లేదు. ఆమె శక్తి, పాజిటివిటీ వైరస్ కంటే ఎక్కువని అన్నారు. కాగా, కిరణ్ మజుందార్ షాకు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ బయోకాన్, కొవిడ్-19 చికిత్సకు వాడే ఇటోలిజుమాబ్ అనే ఔషధాన్ని మళ్లీ తయారు చేసేందుకు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే.

అత్యవసర పరిస్థితుల్లో కొవిడ్-19 సోకిన వారికి చికిత్స కోసం చర్మవ్యాధి సోరియాసిస్‌ని నయం చేసేందుకు వాడే ఇటోలిజుమాబ్‌కు గత నెలలో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DGCI) అనుమతి ఇచ్చింది. కానీ, దీని అనుమతిపై దేశవ్యాప్తంగా విమర్శలొచ్చాయి. దీన్ని తీసుకురావడానికి ముందు కేవలం 4 కొవిడ్ సెంటర్లలో 30 మంది రోగులపై మాత్రమే క్లినికల్ ట్రయల్స్ జరిపారని, దీని ఆధారంగా ఇటోలిజుమాబ్‌కు అనుమతివ్వడం వివాదంగా మారింది.

Next Story

Most Viewed