బిగ్‌బాస్-9: హౌస్ నుంచి ఆ కంటెస్టెంట్ ఔట్.. మంచి పని చేశారంటూ నెటిజన్ల కామెంట్స్

by Mallepaka Hamsa |

బిగ్‌బాస్ సీజన్-9 సక్సెల్‌ఫుల్‌గా సాగుతూ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందుతోంది. సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన ఈ షో అప్పుడే 12 వారాలు పూర్తి చేసుకుంది.

బిగ్‌బాస్-9: హౌస్ నుంచి ఆ కంటెస్టెంట్ ఔట్.. మంచి పని చేశారంటూ నెటిజన్ల కామెంట్స్
X

దిశ, సినిమా: బిగ్‌బాస్ సీజన్-9 సక్సెల్‌ఫుల్‌గా సాగుతూ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందుతోంది. సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన ఈ షో అప్పుడే 12 వారాలు పూర్తి చేసుకుంది. ఇక గత వారం డబుల్ ఎలిమినేషన్ ఉండగా.. చివరి నిమిషంలో ఇమాన్యుయేల్ కారణంగా అసలు ఎలిమినేషన్‌ రద్దు అయింది. డబుల్ ఎలిమినేషన్‌లో సంజన, దివ్య ఉండగా.. పవర్ అస్త్ర వల్ల ఎలిమినేషన్ లేకుండా అయింది. అయినప్పటికీ ఆడియన్స్ ప్రకారం.. ఎవరు ఎలిమినేట్ అయ్యేవారో నాగార్జున చూపించారు. ఇందులో దివ్య డేంజర్ జోన్‌లో ఉంది. అంతే ఇంటి నుంచి గత వారమే బయటకు రావాల్సిన దివ్య ఇమాన్యుయేల్ వల్ల ఇంట్లోని ఉండిపోయింది. ఈ విషయం తెలుసుకున్న వారంతా దివ్య(divya)ని బయటకు పంపితే అయిపోవు అని అనుకున్నారు.

ఆమె వల్ల కొందరి ఆట డిస్టర్బ్ అవుతుందని ఆమెని త్వరగా బయటకు పంపితే బాగుంటుందని అంతా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అంతా భావించారు. తాజా.. సమాచారం ప్రకారం.. ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే అని తెలుస్తోంది. కెప్టెన్ రీతూ తప్ప.. దివ్య, సంజన, తనూజ(tanuja), భరణి(bharani), సుమన్ శెట్టి, డిమాన్ పవన్, కళ్యాణ్, ఇమాన్యుయేల్ నామినేషన్స్‌లో ఉండగా.. ఈ వారం దివ్య ఎలిమినేట్ అయి బయటకు వచ్చినట్లు సమాచారం.ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఇన్నాళ్లకు బిగ్‌బాస్ నిర్వాహకులు మంచి పని చేశారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ద్వారా కామనర్‌గా షో స్టార్ట్ అయిన మూడోవారంకి హౌస్‌లోకి వచ్చింది. భరణితో క్లోజ్ అవడంతో పాటు అతని ఆట సరిగ్గా ఆడకుండా చేసింది. తనూజతో ఎప్పుడూ ఏదో విధంగా గొడవ పెట్టుకుని విమర్శలు పొందింది.

అయినప్పటికీ తన అదృష్టం వల్ల ఇన్నాళ్లు హౌస్‌లో ఉంది. కానీ ఈరోజు దివ్య ఎలిమినేషన్ కన్ఫర్మ్ కావడంతో అప్పుడే ఇంటి నుంచి బయటకు వచ్చేసిందట. ఈరోజు ఎపిసోడ్‌లో అది చూపించనున్నట్లు తెలుస్తోంది. అసలు దివ్య ఎలిమినేషన్‌కు కారణం.. భరణితో బాండింగ్స్.. తనూజతో గొడవలు. భరణిపై పెత్తనం చలాయించడం చాలా మందికి నచ్చలేదు. అలాగే భరణి, తనూజతో మాట్లాడితే చాలు గొడవ పెట్టుకుంటుంది. ఇక ఆమె తీరుకు విసుగెత్తిపోయిన తనూజ, భరణి అభిమానులు ఆమెను ఎలిమినేట్ చేయాలని గత రెండు మూడు వారాలుగా కోరుకుంటున్నారు. కానీ ఆమెని ఆదరించే వారు మాత్రం సేవ్ చేస్తూ వచ్చారు. గత వారం ఇమాన్యుయేల్ వల్ల నామినేషన్స్ నుంచి సేఫ్ అయింది. కానీ ఈ వారం ఆమెని ఏవి సేవ్ చేయకపోవడంతో ఇంటి నుంచి బయటకు రావాల్సి వచ్చింది.

Next Story