స్టూడెంట్స్ బీ అలెర్ట్ : ఈనెల 23న BED ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు

by  |
bed-exams
X

దిశ, నిజామాబాద్ రూరల్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ కాలేజీల్లో గల బీఎడ్ కోర్సుకు సంబంధించి మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలు ఈ నెల 23 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్టు పరీక్షల నియంత్రణాధికారి డా.పాత నాగరాజు బుధవారం సాయంకాలం షెడ్యూల్ విడుదల చేశారు. బీఎడ్ మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ ప్రాక్టికల్ పరీక్ష సెల్ఫ్- డెవెలప్ మెంట్ (ఇపీసీ-I) ఈ నెల 21 తేదీన నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.

డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఏ(ఎల్), కోర్సులకు సంబంధించిన రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 21వరకు ఉందని, రూ.100 లేట్ ఫీజుతో కలిపి ఈ నెల 24 వరకు, 500/- రూ.ఆలస్య అపరాధ రుసుముతో ఈ నెల 26 వరకు, 1000/- రూ. ఆలస్య అపరాధ రుసుముతో ఈ నెల 28 వరకు చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రీ- పీహెచ్డీ, ఆర్ట్స్, సోషల్ సైన్స్, సోషల్, కామర్స్, బిజినెస్ మేనేజ్ మెంట్, సైన్స్ ఫ్యాకల్టీలలో గల సబ్జెక్టులలోని రెగ్యూలర్, బ్యాక్ లాగ్ పరీక్షల ఫీజు గడువు ఈనెల 16 వరకు ఉందని, 500/- రూ. ఆలస్య అపరాధ రుసుముతో ఈ నెల 19 వరకు చెల్లించవచ్చునని వివరించారు. ఈ పరీక్షలను యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ డిచ్‌పల్లిలో ఈ నెల 26, 27 తేదీలలో నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Next Story

Most Viewed