రైతుపై ఎలుగుబంటి దాడి

by  |

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో రైతుపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటన సోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లోకల్ వెల్మల్ గ్రామ సమీప అటవీ ప్రాంతంలో శుక్రవారం చోటుచేసుకుంది. సీఐ జీవన్ రెడ్డి వివరాల ప్రకారం వ్యవసాయ పనుల కోసం మహేశ్ అనే రైతు వెళ్తుండగా ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. కేకలు వేయడంతో ఎలుగుబంటి పారిపోయింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన రైతును ఆస్పత్రికి తరలించామని సీఐ జీవన్ రెడ్డి తెలిపారు.

Tags: Adilabad, Bear, Attack, former, Injury

Next Story