అనుకోకుండా రూ.850 కోట్లు వచ్చినయ్.. ఎలా అంటే..?

by  |
అనుకోకుండా రూ.850 కోట్లు వచ్చినయ్.. ఎలా అంటే..?
X

దిశ, స్పోర్ట్స్ : కరోనా వైరస్ నేపథ్యంలో ఆదాయం రావట్లేదని బాధపడుతున్న బీసీసీఐకి అనుకోకుండా రూ.850 కోట్లు వచ్చిపడ్డాయి. 10 ఏళ్ల క్రితం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా ఉన్న లలిత్ మోడీ, వరల్డ్ స్పోర్ట్స్ గ్రూప్(డబ్ల్యూఎస్‌జీ) వివాదం కారణంగా బీసీసీఐ భారీగా నష్టపోయింది. అప్పట్లో అంతర్జాతీయ మీడియా హక్కులు పొందిన డబ్ల్యూఎస్‌జీ అర్థాంతరంగా దాన్ని వదులుకుంది. దీంతో తమకు భారీ నష్టం ఏర్పడిందని చెబుతూ బీసీసీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాగా, ఇన్నాళ్ల విచారణ తర్వాత ఈ విషయాన్ని మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇందుకోసం రిటైర్డ్ న్యాయమూర్తులు సుజాతా మనోహర్, ముకుంఠకన్ శర్మ, ఎస్ఎస్ నిజ్జార్‌లతో కూడాని ట్రైబ్యునల్ ఏర్పాటు చేసింది. లలిత్ మోడీతో కలసి మోసపూరితంగా హక్కులు దక్కించుకుందని.. ఎస్క్రో ఖాతాలో వేసిన సొమ్ము బీసీసీఐకే చెందుతుందని బోర్డు తరపు న్యాయవాది రఘురామన్ వాదించారు. కేసును పూర్తిగా పరిశీలించి, వాదోపవాదనలు విన్న ట్రైబ్యులన్ రూ.850 కోట్లు బీసీసీఐకే చెందుతాయని తీర్పు చెప్పింది.



Next Story

Most Viewed