ఐపీఎల్‌ 2021: బీసీసీఐ కఠిన నిర్ణయాలు

by  |
ఐపీఎల్‌ 2021: బీసీసీఐ కఠిన నిర్ణయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2021 త్వరలో యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి అవాంతరాలు రాకుండా టోర్నీని నిర్వహించేందుకు బీసీసీఐ చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటినుంచి సిక్సర్ బాడితే వేరే బంతిని ఇవ్వనున్నారు. ఇప్పటివరకు సిక్సర్ బాదితే స్టాండ్స్‌లోకి వెళ్లిన బంతిని అంపైర్లు వెంటనే శానిటైజ్ చేసి ఇచ్చేవారు.

కానీ యూఏఈలో కరోనా దరిచేరకుండా బీసీసీఐ కఠిన ఆంక్షలు అమలు చేయనుంది. బంతిని సిక్సర్ కొడితే అంపైర్లు కొత్త బంతిని ఇవ్వనున్నారు. బంతి వల్ల కరోనా వచ్చే అవకాశాలు అసలు లేవు. అయినా సమస్యలు ఎదురుకాకుండా టోర్నీ సజావుగా నిర్వహించేందుకు కొత్త బంతిని ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది.


Next Story

Most Viewed