సైబర్ దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలి

by  |
సైబర్ దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలి
X

దిశ, వెబ్‌డెస్క్: సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు బ్యాంకింగ్ పరిశ్రమ తమ ఐటీ మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయాలని, అనుభవజ్ఞులైన చీఫ్ రిస్క్ ఆఫీసర్లను నియామించాల్సిన అవసరం ఉందని డెలాయిట్ ఇండియా నివేదిక స్పష్టం చేసింది. 2018-19లో భారత్‌లో జరిగిన సైబర్ దాడుల్లో 22 శాతం బ్యాంకింగ్ పరిశ్రమపైనే జరిగాయని, ఎక్కువ సైబర్ దాడులు బ్యాంకులనే లక్ష్యంగా పెట్టుకున్నాయని నివేదిక అభిప్రాయపడింది. సైబర్ దాడులు రోజురోజుకూ క్లిష్టంగా మారుతున్నాయి. ఈ సవాళ్లను పరిష్కరించేందుకు బ్యాంకులు అనుభవం ఉన్న చీఫ్ రిస్క్ ఆఫీసర్లను నియమించాలి.

వారు ఉద్యోగులకు సైబర్ దాడుల పట్ల నైపుణ్యాన్ని పెంచే బాధ్యతను తీసుకోవాలి. అలాగే, అత్యంత అధునాతన దాడులను గుర్తించేందుకు మిలిటరీ-గ్రేడ్ సైబర్ భద్రతా పరిష్కారాల కోసం పెట్టుబడులు పెట్టాలని డెలాయిట్ నివేదిక పేర్కొంది. కాంట్కాక్ట్‌ లెస్ బిజినెస్ కార్యకలాపాలను వేగవంతం చేయాలి. లాక్‌డౌన్ నేపథ్యంలో పెరిగిన వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి అనుగుణంగా బ్యాంకింగ్ రంగం సిద్ధంగా ఉండాలని నివేదిక పేర్కొంది. టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో డేటా భద్రతకు సంబంధించి బ్యాంకింగ్ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని నివేదిక అభిప్రాయపడింది.

Next Story

Most Viewed