బీజేపీపై నోరు జారిన బండి సంజయ్.. షాకైన లీడర్లు

by  |
BJP chief Bandi Sanjay
X

దిశ, తెలంగాణ బ్యూరో : మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నోరు జారారు. రాష్ట్రంలో బీజేపీ ఇప్పటికే భ్రష్టు పట్టిపోయిందని పరోక్షంగా అంగీకరించారు. మైనంపల్లి టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరడానికి వస్తానని ఎంత ఒత్తిడి చేసినా ఆయనను చేర్చుకోలేదని, అలాంటి వ్యక్తుల్ని చేర్చుకుంటే పార్టీ ఇంకా భ్రష్టుపట్టిపోతుందని వ్యాఖ్యానించారు. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ చివరకు ఎనిమిది మంది గాయాలపాలు కావడానికి దారితీసింది. గాయపడిన బీజేపీ కార్యకర్తలను ఆస్పత్రికి వెళ్లి పరిశీలించిన అనంతరం మైనంపల్లి హన్మంతరావు తీరును తీవ్రంగా ఖండించారు.

ఈ సంఘటనపై బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, “మైనంపల్లి హన్మంతరావు లాంటి ఫాల్తుగాళ్లు వస్తే మేం చేర్చుకోలేదు. సిగ్గులేకుండా బీజేపీలో చేరుతానంటూ నా చుట్టూ తిరిగాడు. ఫాల్తుగాడనే నేను చేర్చుకోలేదు. ప్లీజ్ చేర్చుకోండంటూ కాళ్లు పట్టుకున్నడు. గుండాయిజం, దాదాగిరి చేసే ఇట్లాంటోళ్లను చేర్చుకునేది లేదని చెప్పేశాం. కబ్జాగాళ్లను, ఫాల్తుగాళ్లను చేర్చుకుంటే మా పార్టీ ఇంకా భ్రష్టు పడతది’’ అని వ్యాఖ్యానించారు. పక్కనే ఉన్న బీజేపీ నేతలు పలువురు విస్మయం వ్యక్తం చేశారు. “ఇంకా భ్రష్టు పడతది“ అని చేసిన వ్యాఖ్యలు మరో అర్థానికి దారితీశాయని నొచ్చుకున్నారు. పార్టీ అధ్యక్ష స్థానంలో ఉండి కూడా బాధ్యతగా మాట్లాడకపోవడంతో ఇలాంటి కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయని అభిప్రాయపడ్డారు.

మైనంపల్లి హన్మంతరావు అధికార పార్టీ అండ చూసుకుని పెచ్చుమీరిపోతున్నారని, పోలీసులను అలుసుగా తీసుకుని బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే మహిళలపై అసభ్యంగా ప్రవర్తించారని, హత్యాయత్నానికి పాల్పడ్డారని, అధికార పార్టీకి పోలీసు వ్యవస్థ కొమ్ముకాస్తూ ఉన్నదని ఆరోపించారు. “చంపుకోవడం, తన్నుకోవడమే పోలీసు విధానమైతే, వాళ్లు ఒప్పుకుంటే పక్కాగా మేం అదే స్టార్ట్ చేస్తం’’ అని చేసిన వ్యాఖ్యలు కూడా హత్యా రాజకీయాలను ప్రోత్సహించే విధంగా, బీజేపీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయన్న విమర్శలకు కారణమైంది.

ఇవి కూడా చదవండి:

సీఎం కేసీఆర్ దేశ చరిత్రలో నిలిచిపోయే మరో సంచలన నిర్ణయం..


Next Story

Most Viewed