ఇళ్ల కూల్చివేత నిలిపివేయాలి.. బండి సంజయ్ ఆగ్రహం

by  |
Bandi-sanjay
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ అధికారులు, మేయర్ కలిపి అక్రమ కట్టడాలు కూల్చివేయాలని నిర్ణయించి కేవలం హిందువుల ఇళ్లను మాత్రమే టార్గెట్ చేస్తూ కూల్చివేతలు కొనసాగిస్తుండటం దుర్మార్గం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ద్వజమెత్తారు. గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంఐఎం శాసనసభ్యుల ప్రాంతాలైన చార్మినార్ జోన్, ఖైరతాబాద్ జోన్లకు మినహాయింపు ఇవ్వడం అన్యాయం అన్నారు. ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఎంఐఎం శాసన సభ్యుల నియోజకవర్గాలు అంటే ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు అని, వీటిని మినహాయింపు ఇచ్చి అక్రమ నిర్మాణాల పేరిట కూల్చివేతలు చేయడం దారుణమన్నారు. ఇది ఒక రకంగా మెజారిటీలపై ప్రభుత్వం చేస్తున్న దాడిగా అభివర్ణించారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కూల్చివేతలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఖైరతాబాద్ జోన్, చార్మినార్ జోన్‌లో వేలాది అక్రమ నిర్మాణాలు కూల్చి వేసిన తర్వాతే మిగతా జోన్‌లలో చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకుంటే బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రజల పక్షమే బీజేపీ లక్ష్యం అన్నారు.


Next Story

Most Viewed