బజాజ్ ఫైనాన్స్ కొత్త రికార్డు!

by  |
బజాజ్ ఫైనాన్స్ కొత్త రికార్డు!
X

దిశ, వెబ్‌డెస్క్: దిగ్గజ ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ మొదటిసారిగా 3 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ రికార్డును సాధించింది. కంపెనీ షేర్ ధర 5 శాతం లాభపడటంతో షేర్ ధర రూ. 5,137కు మంగళవారం పుంజుకుంది. ఈ నేపథ్యంలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 3.08 లక్షల కోట్లకు పెరిగింది. ప్రస్తుత ఏడాది బజాజ్ ఫైనాన్స్ షేర్ ధర ఏకంగా 21 శాతం వృద్ధిని సాధించింది. గడిచిన ఎనిమిది నెలల కాలంలో కంపెనీ షేర్ ధర రూ. 1,783 నుంచి రూ. 5,150కి ర్యాలీ చేసింది. దీంతో అధిక మార్కెట్ క్యాప్ కలిగిన సంస్థల్లో ఒకటిగా రికార్డును దక్కించుకుంది.

దేశీయంగా లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత వ్యాపార కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఇదే క్రమంలో ఇన్వెస్టర్లు ఎక్కువగా బజాజ్ ఫైనాన్స్ షేర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొవిడ్-19 సంబంధిత సవాళ్ల నుంచి కంపెనీ వేగంగా బయటపడి ప్రతి నెలా మెరుగైన వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుతం కంపెనీ రిటైల్ ఈఎంఐ, వ్యాలెట్ మినహా అన్ని కార్యకలాపాలను ప్రారంభించినట్టు, వచ్చే ఏడాది మార్చి లోపు అన్ని కార్యకలాపాలు మొదలవుతాయని కంపెనీ సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల సందర్భంలో వెల్లడించింది.

Next Story

Most Viewed