గ్రామీణ వినియోగదారుల కోసం బజాజ్ అలియాంజ్‌తో ఐపీపీబీ ఒప్పందం..

by  |
agreement
X

దిశ, వెబ్‌డెస్క్: బజాజ్ అలియాన్స్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ), పోస్టల్ శాఖ(డీఓపీ) గురువారం కీలక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. దేశవ్యాప్తంగా గ్రామీణ వినియోగదారుల కోసం రెండు బీమా ఉత్పత్తులను ప్రారంభించాయి. ఐపీపీబీకి ఉన్నటువంటి 650 శాఖల విస్తృతమైన నెట్‌వర్క్ ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ టర్మ్, యాన్యూటీ బీమా ఉత్పత్తులను అందించనుంది. ఈ భాగస్వామ్యం వినియోగదారులను, ముఖ్యంగా బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఉండే వారికి బీమా ప్రయోజనాలు అందించాలనే లక్ష్యంతో జరిగిందని, ఈ నిర్ణయం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని బలహీన వర్గాలు ఆర్థికంగా రక్షణను పొందుతారని మూడు సంస్థలు భాగస్వామ్యం ప్రకటనలో తెలిపాయి. ఈ ఒప్పందం తర్వాత గ్రామీణ వినియోగదారులు బజాజ్ అలియాంజ్ లైఫ్ స్మార్ట్ ప్రొటెక్ట్ గోల్, బజాజ్ అలియాంజ్ లైఫ్ గ్యారెంటీడ్ పెన్షన్ గోల్ అయిన టర్మ్, యాన్యూటీ బీమా ఉత్పత్తులను పొందడానికి వీలవుతుంది. ఆర్థిక భద్రతతో పాటు అనుకోని పరిస్థితుల్లో వైద్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు బీమా ముఖ్యమైన పెట్టుబడి సాధనంగా ఉందని బజాజ్ అలియాంజ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ‘తమ బలమైన బ్యాంకింగ్ యాక్సెస్ పాయింట్ల నెట్‌వర్క్ ద్వారా వినియోగదారుల ఆర్థిక పరిష్కారాలను అందించేందుకు కట్టుబడి ఉన్నామని’ ఐపీపీబీ ఎండీ, సీఈఓ జె వెంకటరాము అన్నారు.


Next Story

Most Viewed