నారదా కేసులో నలుగురు నేతలకు బెయిల్..

by  |
నారదా కేసులో నలుగురు నేతలకు బెయిల్..
X

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో నారదా కుంభకోణం కేసులో సీబీఐ అరెస్టు చేసిన ముగ్గురు నేతలకు కలకత్తా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు మంత్రులు సుబ్రతా ముఖర్జీ, పిర్హద్ హకీమ్‌లు, టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్ర, కలకత్తా మాజీ మేయర్ సోవన్ చటర్జీలకు ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం బెయిల్ మంజూరు చేస్తూ నలుగురూ రూ. 2 లక్షల చొప్పున పర్సనల్ బాండ్, ఇద్దరు వ్యక్తుల షూరిటీ సమర్పించాలని ఆదేశించింది. కేసు దర్యాప్తులో సీబీఐకి సహకరించాలని, అడిగినప్పుడు వీడియో కాన్ఫరెన్సింగ్‌లో విచారణకు హాజరవ్వాలని తెలిపింది. కేసుకు సంబంధించి ప్రెస్ మీట్లు పెట్టవద్దని, దర్యాప్తులోనూ జోక్యం కలుగజేసుకోవద్దని వివరించింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దవుతుందని స్పష్టం చేసింది. నారదా కేసులో సీబీఐ అధికారులు వీరిని అరెస్టు చేసిన తర్వాత మే 19న మధ్యంతర బెయిల్‌పై కలకత్తా హైకోర్టు డివిజన్ బెంచ్ భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీంతో విస్తృత ధర్మాసనానికి బెయిల్ పిటిషన్‌ను బదిలీ చేయగా.. తాజాగా, బెయిల్ ఆదేశాలు వచ్చాయి.

Next Story

Most Viewed