సమయానికి మోగని బడిగంట.. పాఠశాల ముందు విద్యార్థుల నిరీక్షణ..

by  |
సమయానికి మోగని బడిగంట.. పాఠశాల ముందు విద్యార్థుల నిరీక్షణ..
X

దిశ, మహబూబాబాద్ టౌన్: సాధారణంగా ఎక్కడైనా పాఠశాలను తెరిచి విద్యార్థుల రాక కోసం వేచి చూస్తారు. కానీ ఇక్కడ మాత్రం అలా జరగదు. విద్యార్థులు ముందుగా వచ్చి స్కూల్ గేట్ ముందు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. వివరాల్లోకి వెల్తే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ని వెంకటేశ్వర బోడ్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలి నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు స్కూల్ గేట్ బయట పడిగాపులు కాయాల్సి వచ్చింది. సమయానికి పాఠశాల ను తెరవక పోవడం వల్ల విద్యార్థులు అసహనానికి గురవుతున్నారు. ఆమే ప్రతి రోజు ఇలానే చేస్తుందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే బడ్జెట్ విషయంలో బడి చైర్మన్ తో సంబంధం లేకుండా నిధులు డ్రా చేసుకుంటూ తన ఇష్టానికి వాడుకున్నట్లు స్కూల్ చైర్మన్ వాపోతున్నారు.

రోజు పాఠశాలకు ఆలస్యంగా రావడం, సమయానికి ముందే వెళ్లి పోవడం జరుగుతుంది. ఇలా చేస్తే తమ పిల్లలకు ఎలా చదువులు వస్తాయని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఈ రోజు ఉదయం 9.30 అవుతున్న పాఠశాల తాళం తీయకపోవడంతో.. పుస్తకాలతో బడికి వచ్చిన పిల్లలు తాళం వేసి ఉండటంతో ఖంగుతిన్నారు. ఏది ఏమైనా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలి విషయంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


Next Story

Most Viewed