డాక్టర్ల నిర్లక్ష్యం.. 24 గంటలు గడవక ముందే సూర్యాపేటలో మరో ఘటన..

by  |
died
X

దిశ, సూర్యాపేట: సూర్యాపేట నియో హాస్పిటల్‌‌లో డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే శిశువు మరణించిందని శిశువు బంధువులు డాక్టర్లతో వాగ్వాదానికి దిగారు. వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం మున్య నాయక్ తండాకు చెందిన ధరవత్ నాగేశ్వరి మూడవ కాన్పులో జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో బాబుకు జన్మనిచ్చింది. పురిటి సమయంలో కడుపులో ఉన్న శిశువు మలినాలను మింగడంతో ఊపిరితిత్తులకు చేరింది. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ అవ్వడంతో మెరుగైన చికిత్స కొరకు నియో హాస్పిటల్‌లో శనివారం ఉదయం అడ్మిట్ చేశారు. చికిత్స సమయంలో శిశువు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన చికిత్స చేయాలని అందుకు ఖరీదైన ఇంజక్షన్ వేయాలని డాక్టర్ సూచించడంతో రూ.30వేలు ఖరీదు చేసే ఇంజక్షన్ వేయడం జరిగింది.

తీరా శిశువు పరిస్థితి విషమంగా ఉందంటూ హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కి రిఫర్ చేశారు. దీంతో వారు మెరుగైన చికిత్స కొరకు హైదరాబాద్‌లోని నిలోఫర్ హాస్పిటల్‌కి తీసుకెళ్లగా అప్పటికే శిశువు మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. దీంతో శిశువు కుటుంబ సభ్యులు డాక్టర్ వేసిన ఇంజక్షన్ వికటించడంతోనే మరణించిదనీ హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు. ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ అవ్వడంతో ఇంజెక్షన్ ఇచ్చామని, అయినప్పటికీ శిశువు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు రిఫర్ చేశామని డాక్టర్లు చెబుతున్నారు. హైదరాబాద్‌కు వెళ్లే సమయంలో కూడా శిశువు బాగానే ఉందంటూ డాక్టర్లు తెలుపుతున్నారు.


Next Story

Most Viewed