తెగిన చెరువు కట్ట.. నీట మునిగిన ఇళ్లు

39

దిశ, వెబ్‌డెస్క్ :

హైదరాబాద్‌లో రాత్రి కురిసిన భారీ వర్షాలకు పాతబస్తీలోని బాలాపూర్‌లో ఉన్న గుర్రం చెరువు కట్ట తెగింది. దీంతో బాబానగర్‌లోని చుట్టుపక్కల ఇళ్లలోకి నీళ్లు చేరాయి. అంతేకాకుండా పలు ఇళ్లు నీట మునిగాయి. వరద ప్రవాహానికి పలు వాహనాలు కూడా కొట్టుకుపోయాయి.

విషయం తెలుసుకున్న ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బాబానగర్ ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు. తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పాతబస్తీ భవానీనగర్ తలాబ్ కట్ట ప్రాంతంలో ఇంటిగోడ కూలింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.