రామమందిరంపై ప్రముఖుల స్పందనలివే!

by Dishanational2 |
రామమందిరంపై ప్రముఖుల స్పందనలివే!
X

దిశ, నేషనల్ బ్యూరో: రామమందిర వేడుకకు హాజరైన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి ఈ వేడుకపై ప్రశంసలు కురిపించారు. విగ్రహ ప్రతిష్ట ఖచ్చితంగా చారిత్రాత్మకమైన రోజు అని కొనియాడారు. ‘ప్రపంచం హింస, యుద్ధం నుంచి విముక్తి పొందుతుంది. ఇదే అయోధ్య సందేశం’ అని చెప్పారు. రాముడు గొప్ప వ్యక్తి అని ఆయన ఆదర్శాలను పాటించాలని సూచించారు.

దేశం మరో దీపావళి జరుపుకుంటోంది: ఐరాస జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్

అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నేపథ్యంలో భారతదేశానికి వచ్చినందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు ఐక్య రాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ తెలిపారు. భారత్‌తో శాంతి, పురోగతిపై చర్చించడానికి తాను ఎదురుచూస్తున్నానని చెప్పారు. దేశంలో మరోసారి దీపావళి పండుగ వాతావారణం నెలకొందని తెలిపారు.

నేను అత్యంత అదృష్ట వంతుడిని: రామ్ లల్లా విగ్రహ రూప శిల్పి అరుణ్ యోగిరాజ్

విగ్రహ ప్రతిష్టాపన అనంతరం రామ్ లల్లా విగ్రహ రూపశిల్పి అరుణ్ యోగిరాజ్ స్పందించారు. ‘నేను ఇప్పుడు భూమిపై అత్యంత అదృష్టవంతుడిగా భావిస్తున్నా. నా పూర్వీకులు, కుటుంబ సభ్యులు, రామ్ లల్లా ఆశీర్వాదం నాకు ఎల్లప్పుడూ ఉంది. కొన్నిసార్లు కలల ప్రపంచంలో ఉన్నట్లు అనిపిస్తుంది’ అని చెప్పాడు.



Next Story

Most Viewed