పసి మనసులపై బ్యూటీ ప్రొడక్ట్స్ నెగెటివ్ ఎఫెక్ట్ : హీరోయిన్

70
actress Avika gor

దిశ, సినిమా : ఫెయిర్‌నెస్ ప్రొడక్ట్స్ కంపెనీలు.. బ్యూటీ కాన్సెప్ట్‌ ద్వారా బ్యూటీ స్టాండర్డ్స్ గురించి ప్రజల్లోకి తప్పుడు సందేశాన్ని పంపుతున్నాయని హీరోయిన్ అవికా గోర్ అభిప్రాయపడింది. అందుకే తాను ఫెయిర్‌నెస్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసేందుకు, అడ్వర్టైజ్‌మెంట్స్‌లో నటించేందుకు ఒప్పుకోలేదని తెలిపింది. ఎవరినీ డీగ్రేడ్ చేయకూడదనేది ఇందుకు మరో కారణం కాగా.. ఫెయిర్‌నెస్ అనేది కాన్ఫిడెంట్‌, బ్యూటిఫుల్‌గా ఉంచుతుందనే నమ్మకం తనకు లేదని వివరించింది. ఫెయిర్‌గా ఉండటం అనేది వ్యక్తిత్వాన్ని రిప్రజెంట్ చేయదన్న అవికా, ఈ ఐడియాతో తానెప్పుడూ కంఫర్ట్‌గా లేనని చెప్పింది. ఇది యంగ్ మైండ్స్‌ను ప్రభావితం చేస్తుందని అభిప్రాయపడింది.

ఒక యాక్టర్‌గా ఇలాంటి విషయంలో సొసైటీకి రాంగ్ మెసేజ్ పంపించలేనన్న ఆమె.. అందం కాదు మన వర్క్ ఎతిక్స్, ఆలోచన, ప్రతిభ మరియు వ్యక్తిత్వం మాత్రమే ముఖ్యమని, ఇవే మనను నిర్వచిస్తాయని తెలిపింది. కెరియర్ పరంగా హైట్స్‌లో ఉన్న సమయంలోనూ తన ప్రతిభను అనుమానించానని, తనకు తాను అగ్లీగా భావించిన రోజులు కూడా ఉన్నాయని తెలిపింది. అయితే ఆ దృక్పథంలో మార్పు వచ్చాకే తన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టానని.. సెల్ఫ్ లవ్, ఆహారంపై కాన్సంట్రేట్ చేశాక హ్యాపీగా ఉన్నానని తెలిపింది.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..