లాక్ డౌన్ ఎఫెక్ట్ : ఆటోనడవదు.. బతుకుసాగదు

54

దిశ, తెలంగాణ బ్యూరో: పూట గడవాలంటే ఏదో ఒక పని చేసుకోవాల్సిందే. ఎవరికి ఏ పని వస్తే ఆపి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే కొంత మంది తమకు వచ్చిన డ్రైవింగ్ ను నడుపుకొని జీవనం సాగిస్తున్నారు. అందులో కొందరు ఆటోలను నడుపుకుంటూ బతుకు బండిని లాగిస్తున్నారు. మూడు చక్రాల ఆటో తిరిగితే తప్ప కడుపు నిండదు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఆటో కార్మికులు దుర్భరజీవితాలను గడుపుతున్నారు. చేసేందుకు పనిలేక.. మరో వైపు ఇళ్లు గడువగా, ఆటో ఫైనాన్స్‌లు ఎళ్లక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మినహాయింపు ఇచ్చినా ఆటో ఎక్కేవారు లేరు. 9 గంటల నుంచి10 గంటల మధ్య ఒకటిరెండు ట్రిప్పులు మాత్రమే పడుతుండటంతో ఆటో డిజిల్‌కే సరిపోవడం లేదు.

హైదరాబాద్ నగరంలో సుమారు 2లక్షల49 వేలకు పైగా ఆటోలున్నాయి. రోడ్డు రవాణా సంస్థల తర్వాత అత్యధికంగా ప్రయాణికులను చేరవేసేది ఆటోల ద్వారానే. కానీ ఇప్పుడు పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. కరోనా వారి ఉపాధిని చిన్నాభిన్నం చేసింది. దీనితోడు అద్దె ఆటోలపై ఇద్దరు కార్మికుల కుటుంబాలు ఆధారపడ్డాయి. పగటి వేళలో ఒకరు… రాత్రి సమయాల్లో మరొకరు ఆటోను నడుపుకుని జీవితం గడిపే వారు సుమారు 50వేలకు పైగా ఉన్నారు. ఇలా ఆటోల సంఖ్య కంటే ఎక్కువగానే కార్మికులు వీటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. లాక్‌డౌన్ తో నిత్యం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే కూలీలంతా సొంతూళ్లకు వెళ్లిపోవడం, ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపు ఉండటం, కరోనాతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సైతం సగం మందే వెళ్తుండటం, అందులో సగానికి పైగా సొంత వాహనాలపై వెళ్తుండటంతో ఆటోవాలా కు ఉపాధి కరువైంది. కుటంబానికి ఎలా పోషించాలో అర్ధంకాగా మనోవేధనకు గురవుతున్నారు.

కరోనాతో పాఠశాలల మూత, పనులు లేక వలస కార్మికులు కూడా తిరిగి స్వగ్రమాలకు వెళ్లిపోవడంతో ఆటో ఎక్కేవారు లేక పోవడంతో ఆదాయ వనరులు కరువయ్యాయి. గంటల కొద్ది వేచిచూసినా ప్రయాణికులు రాకపోవడంతో ఖాళీ చేతులతో ఇంటిముఖం పడుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవన నిర్మాణ పనులు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు లేక పోవడంతో ట్రాలీ(గూడ్స్) ఆటోలకు పనిలేకుండా పోయింది. వాటినే నమ్మకున్న కార్మికులు రోడ్డున పడే పరిస్థితి దాపురించింది. ఫైనాన్స్‌లో ఆటోలు కొనుగోలు చేసిన ఆటో డ్రైవర్లు పడరాని పాట్లు పడుతున్నారు. ఓ వైపు ఇంటి ఖర్చులు, మరో వైపు ఆటో ఫైన్సాన్స్‌ నెలవారీ చెల్లింపుల భయంతో బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..