టాటా నుంచి బైక్స్‌..215 కి.మీ మైలేజ్, ధ‌ర ఎంతంటే ?

by velandi.Saikiran |

టాటా నుంచి బైక్స్ వ‌స్తున్న‌ట్లు ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

టాటా నుంచి బైక్స్‌..215 కి.మీ మైలేజ్, ధ‌ర ఎంతంటే ?
X

దిశ‌, వెబ్ డెస్క్: టాటా కంపెనీ నుంచి వచ్చిన కార్లకు ఫుల్ గిరాకీ ఉంటుందన్న సంగతి తెలిసిందే. టాటా నుంచి వచ్చిన ప్రతి కారు 5 స్టార్ రేటింగ్ కలిగి ఉంటుంది. మైలేజ్ తక్కువ ఇచ్చినప్పటికీ.. సేఫ్టీ విషయంలో టాటా కంపెనీని మించినది లేదు. అయితే ఇప్పటి వరకు టాటా నుంచి ఫోర్ వీలర్ వాహనాలు మాత్రమే వచ్చాయి. త్వరలో టూవీలర్ బైక్స్ లాంచ్ అవుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో టాటా నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు లాంఛ్ అయిన‌ట్లే వాటి ఫోటోలను కూడా వైరల్ చేస్తున్నారు. ఒక్కో బైక్ కేవలం రూ.19,999 అని కొన్ని పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ బైక్ ఒక్క‌సారి ఫుల్ ఛార్జింగ్ అయిందంటే.. 215 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుందని ఓ పోస్టు హాట్ టాపిక్ అయింది.

ఇక మరో పోస్టులో 60 వేలకు రెండు టాటా ఎలక్ట్రిక్ స్కూటర్లు రాబోతున్నట్లు పోస్ట్ వైరల్ చేస్తున్నారు. ఇందులో ఒక్క బైక్ కొంటే మరొక బైక్ ఉచితంగా ఇస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కో బైక్ 601 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుందని పేర్కొన్నారు. ఈ బైక్స్ పల్లెటూర్లలో వాడడానికి అనుకూలంగా ఉండేలా తయారు చేసినట్టు కూడా వెల్లడించారు. అయితే టాటా కంపెనీ నుంచి ఈ బైక్స్ పైన ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కొంతమంది సోషల్ మీడియాలో మాత్రం పోస్టులు వైరల్ చేస్తున్నారు. అధికారికంగా స్కూటర్ వస్తే ఎలా ఉంటుంది అనే మోడల్ ను ఈ పోస్టుల ద్వారా స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా టాటా నుంచి ఎలక్ట్రిక్ బైక్ వస్తే తక్కువ ధరలోనే, సామాన్యులు కొనుగోలు చేసేలా ఉంటుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.

Next Story