- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..
<p>దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కరక గూడెం మండలంలో ఆటో, ట్రాక్టర్ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఘటన వివరాల్లోకి వెళితే…. కరక గూడెం మండలం నీలాద్రీ పేట గండికి చెందిన సోడి సాగర్(25), మడివి బామన్ లు అదే మండలంలోని అంగారి గూడెం నకు చెందిన బంధువుల ఇంటికి వెళ్లారు. రాత్రి 7 గంటల సమయంలో ఆటోలో వారు తిరుగు ప్రయాణం అయ్యారు. […]</p>

దిశ, మణుగూరు:
భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కరక గూడెం మండలంలో ఆటో, ట్రాక్టర్ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఘటన వివరాల్లోకి వెళితే…. కరక గూడెం మండలం నీలాద్రీ పేట గండికి చెందిన సోడి సాగర్(25), మడివి బామన్ లు అదే మండలంలోని అంగారి గూడెం నకు చెందిన బంధువుల ఇంటికి వెళ్లారు. రాత్రి 7 గంటల సమయంలో ఆటోలో వారు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో కల్వల నాగారం గ్రామ సమీపంలో జామాయిల్ లోడ్ తో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ను ఆటో ఢీ కొట్టింది. దీంతో సాగర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా బామన్ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి . దీంతో 108 ద్వారా పినపాక ప్రభుత్వ ఆసుపత్రికి అతన్ని తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృత దేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.






