మైనర్ బాలికపై బాలుడి అత్యాచార యత్నం..

165

దిశ, పాలేరు: అభంశుభం తెలియని ఆరేళ్ళ మైనర్ బాలికపై 8వ తరగతి బాలుడు అత్యాచారం యత్నం చేసినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్న ఘటన పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలంలోని ఓ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఆదివారం కావడంతో ఆడుకుంటున్న పాపను ఇంటి పక్కన ఉన్న 13 సంవత్సరాల బాలుడు ఆ పాపను తన ఇంట్లోకి తీసుకెళ్లి తలుపులు మూసి వికృత చేష్టలు చేయబోగ పాప ఏడుస్తూన్న విషయాన్ని చుట్టుపక్కల వారు గమనించారు. పాప తల్లిదండ్రులు ,అటు బాలుడు తల్లిదండ్రులు సహితం కూలీ పనులకు వెళ్లారు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు పాప విషయాన్ని చెప్పగా కోపోద్రికులైన పాప తల్లిదండ్రులు బాలుడు ఇంటి వద్దకు వెళ్లి గొడవకు దిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

దీనితో పాప తల్లిదండ్రులు నేలకొండపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు పాపను లేడీ కానిస్టేబుల్ సమక్షంలో ఆసుపత్రికి తరలించారు. బాలుడిపై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేయనున్నట్లు ఏఎస్సై రాఘవయ్య తెలిపారు. ప్రస్తుతం పాప ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..