కన్నీటి ‘వర్షం’.. నిండా మునిగిన అన్నదాతలు

by  |
crop-loss
X

దిశ, నిర్మల్ రూరల్ : నిర్మల్ జిల్లాలో గత మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు రైతులను నిండా ముంచాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో వరినాట్లు, ఇతర వాణిజ్య పంటలు సాగు చేద్దామనుకున్న రైతులకు ఇక కన్నీళ్లే మిగిలాయి. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లడంతో పంట పొలాలు మొత్తం నీటమునిగాయి. జిల్లాలోని పరిసర మండలాలైన సోన్, లక్ష్మణ చాంద, మమడ, దీలవార్ పూర్, సారంగపూర్ తీవ్ర ఆస్తినష్టం వాటిల్లింది. అదే విధంగా గ్రామాల్లోని విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్స్ నెలకొరగడంతో పలు గ్రామాల్లో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

వాగులు, వంకలు పరవళ్లు తొక్కడంతో పలుచోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. దీంతో ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా నిర్మల్, ఖానాపూర్ జాతీయ రహదారిపై గల బాబాపూర్ వద్ద రోడ్ కోతకు గురికావడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిసిపోయాయి. అలాగే భారీ వర్షాల కారణంగా భారీగా పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికాలు తెలిపారు. లక్ష్మణ చాంద మండలంలో దాదాపు 700 ఎకరాలు, అలాగే మమడ మండలంలో 3,335 ఎకరాలు, సోన్ మండలంలో 1600 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.



Next Story

Most Viewed