‘చైనా ఆక్రమించిన భూభాగం మనదే’

by  |
‘చైనా ఆక్రమించిన భూభాగం మనదే’
X

న్యూఢిల్లీ: భారత భూభాగం ఫింగర్ 4 వరకే ఉందనడం పూర్తిగా అబద్ధమని కేంద్ర రక్షణమంత్రిత్వశాఖ తెలిపింది. భారత చిత్ర పటం ద్వారా దేశ సరిహద్దులను ఇప్పటికే వర్ణించారని, ఇందులో 1962 తర్వాత చైనా అక్రమంగా ఆక్రమించిన 43,000 చ.కి.మీ. భూభాగం కూడా ఉందని స్పష్టం చేసింది. తూర్పు లడాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో బలగాల ఉపసంహరణ కోసం మాత్రమే అంగీకారం కుదరిందని, అంతేగాని ఎలాంటి సరిహద్దులను భారత్ అంగీకరించలేదని పేర్కొంది. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం భారత భూభాగాన్ని చైనాకు దారాదత్తం చేసిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించిన కొన్ని గంటల తర్వాత రక్షణశాఖ ప్రకటన చేయడం గమనార్హం.

భారత్ ప్రకారం వాస్తవ నియంత్రణ రేఖ ఫింగర్ 8 వద్ద ఉంది. అంతేగాని ఫింగర్ 4 వద్ద కాదు. అందుకే ప్రస్తుత అవగాహన ప్రకారం ఫింగర్ 8వరకు పెట్రోలింగ్ నిర్వహించడం భారత్ కొనసాగిస్తుంది. పాంగాంగ్ సో ఉత్తర ఒడ్డును ఇరుదేశాలకు చెందిన పోస్టులు చాలా కాలంగా ఉన్నాయని, అవి శాశ్వతమైనవి. ఇప్పుడు చేసుకున్న ఒప్పందం వాస్తవ నియంత్రణ రేఖను గౌరవించాల్సి ఉంటుందని, ఏకపక్షంగా యథాతథ స్థితిని ఉల్లంఘించాడాన్ని ఇది నిరోధిస్తుంది‘ అని రక్షణమంత్రిత్వశాఖ తెలిపింది.

Next Story