Ap Government: మెగా డీఎస్సీపై గెజిట్ విడుదల

by srinivas |
Ap Government: మెగా డీఎస్సీపై గెజిట్ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరింది. సీఎం పదవి చేపట్టిన వెంటనే మెగా డీఎస్సీ ఫైలుపై ఆయన తొలి సంతకం చేశారు. దీంతో మెగా డీఎస్సీపై తాజాగా ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని, తొలి సంతకం ఆ ఫైలుపైనే పెడతామని చంద్రబాబు చెప్పారు. చెప్పినట్లే అధికారం చేపట్టిన వెంటనే మెగా డీఎస్సీపై జీవో జారీ చేశారు. 16,347 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 31 నాటికల్లా ఈ ప్రక్రియను ముగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు సీఎస్ నీరబ్ కుమార్ సమాచారం అందించారు. భర్తీ ప్రక్రియను కొనసాగించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 16, 347 పోస్టుల్లో ఎస్‌జీటీ- 6371, స్కూల్ అసిస్టెంట్స్-7725, టీజీటీ- 1781, పీఈటీ-132, పీజీటీ-286, ప్రిన్సిపల్-52 పోస్టులను భర్తీ చేయనున్నారు.Next Story

Most Viewed