అస్సాం మహిళతో ప్రేమ .. ఒంటరిగా గదిలోకి వెళ్లి..

by  |

దిశ, శేరిలింగంపల్లి: ప్రేమ విఫలమైందన్న మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాం రాష్ట్రంలోని ఐలాఖండి జిల్లా దీనానంతపూర్ గ్రామానికి చెందిన సంజు బర్మాన్ (23) అనే యువకుడు మాదాపూర్ సిద్దిక్‌నగర్ లో ఉంటూ గోల్డెన్ స్టార్ ఫెసిలిటీస్‌లో హౌస్ కీపింగ్ వర్క్ చేస్తున్నాడు. అస్సాం రాష్ట్రానికే చెందిన మహిళతో ప్రేమ వైఫల్యం కావడంతో గత కొద్దిరోజులుగా డిప్రెషన్‌లో ఉన్నాడు. దీంతో బుధవారం గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed