Police bike rally: లాక్ డౌన్ సమయంలో పోలీసుల బైక్ ర్యాలీ

by  |
Police bike rally: లాక్ డౌన్ సమయంలో పోలీసుల బైక్ ర్యాలీ
X

దిశ, ముధోల్: తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఎ ఎస్ పీ కిరణ్ కారే అన్నారు. భైంసా పట్టణంలో సోమవారం సాయంత్రం ప్రధాన రహదారుల గుండా బైక్ ర్యాలీగా వెళ్ళి లాక్ డౌన్ అమలు తీరును పరిశీలించారు. అనంతరం బైంసా బస్స్టాండ్ ముందర విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఎఎస్‌పీ మాట్లాడుతూ… శుభ కార్యాలు నిర్వహించుకునే వారు ముందుగా అనుమతులు పొంది ఉదయం 6 నుండి 10 గంటల లోపు కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలని, అలాగే అవసరం నిమిత్తం ఇతర రాష్ట్రాలకు, జిల్లాలకు వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడితే ముందుగానే ఈ పాస్ తీసుకోవాలని తెలిపారు. 10 తరువాత అనుమతి లేకుండా వాహనాలు తిరిగితే సీజ్ చేస్తామని, ఇప్పటికే 61 ద్విచక్ర వాహనాలు సీజ్ చేసినట్టుగా పేర్కొన్నారు. 220పోలీసు బలగాలతో లాక్ డౌన్ అమలు తీరును రోజు పరిశీలుస్తున్నమన్నారు. అదేవిధంగా ప్రజలు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటిస్తు పోలీసులకు సహాకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎస్‌పీతో పాటు సీఐ ప్రవీణ్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.


Next Story

Most Viewed