అరుణ్ విజయ్.. 25 ఇయర్స్ ఇండస్ట్రీ

by  |
అరుణ్ విజయ్.. 25 ఇయర్స్ ఇండస్ట్రీ
X

అరుణ్ విజయ్… తమిళ సినిమాకు దొరికిన వర్సెటైల్ యాక్టర్. 18 ఏళ్ల వయస్సులోనే కెరియర్‌ను ప్రారంభించినా తమిళ ఇండస్ట్రీ తన టాలెంట్‌ను గుర్తించేందుకు చాలాఏళ్లే పట్టింది. ఏకంగా 17 సంవత్సరాల తర్వాత కానీ.. అరుణ్‌లోని నిజమైన నటున్ని గురించలేకపోయింది తమిళ సినీరంగం. కోలీవుడ్‌కు అత్యంత పిన్న వయస్సులోనే ఎంట్రీ ఇచ్చిన హీరోగా రికార్డు క్రియేట్ చేసిన అరుణ్ సీనియర్ హీరో విజయ్ కుమార్ తనయుడు. వారసత్వం ఉన్నా కూడా అదృష్టం కలిసిరాక చాలా కష్టాలు పడ్డాడు. తొలి రెండు సినిమాలతోనే యాక్టర్‌గా, డ్యాన్సర్‌గా ప్రూవ్ చేసుకున్నా కమర్షియల్ హీరోగా మారేందుకు, బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు ఇన్నాళ్లు పట్టింది.

స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడం ఒక కళ అయితే .. అందులో నంబర్ వన్ అరుణ్ విజయ్ అంటారు ఆయన అభిమానులు. కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన అరుణ్ విజయ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 25 ఏళ్లు. యూనిక్ యాక్టర్‌గా ప్రశంసలు పొందని అరుణ్ డెడికేషన్ లెవల్స్‌కు ఫిదా అయిపోతారు ఫిల్మ్ మేకర్స్. సినీ కెరియర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న విజయ్… నమ్మకం కోల్పోకుండా ప్రయత్నిస్తూ టాలెంటెడ్ హీరోగా ఎదిగాడు.

సుందర్ సి దర్శకత్వంలో మురై ముప్పిళ్లై సినిమాతో కోలివుడ్ ఎంట్రీ ఇచ్చాడు అరుణ్ విజయ్. తొలి సినిమాతోనే తన డ్యాన్స్, ఫైట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తర్వాత వచ్చిన ప్రియమ్ సినిమాలో దిల్ రుబా సాంగ్‌తో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. కానీ, తర్వాత చేసిన సినిమాల్లో విజయ్ నటనకు ప్రశంసలు వచ్చినా రిలీజ్, బడ్జెట్ టెన్షన్స్‌తో ఫ్లాప్‌గా నిలిచాయి. 2015లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన యెన్నై అరిందాల్ సినిమాతో తన విలనిజాన్ని రుచి చూపాడు ఇండస్ట్రీకి. ఈ సినిమా కోసం రోజుకు ఆరు గంటలపాటు జిమ్‌లో వర్కౌట్ చేసిన అరుణ్… హీరో అజిత్, డైరెక్టర్ గౌతమ్ మీనన్, సినీ విమర్శకులు, అభిమానుల ప్రశంసలు అందుకున్నాడు. తెలుగులో బ్రూస్‌లీ, కన్నడలో చక్రవ్యూహ సినిమాల్లో విలన్‌‌గా మెప్పించాడు. అరుణ్ విజయ్ విలన్ శకం ముగిశాక హీరోగా వచ్చిన సినిమా కుట్రం బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది. తడమ్ సినిమాలో అరుణ్ తొలిసారిగా డ్యుయల్ రోల్ చేసి విమర్శకులను సైతం మెప్పించాడు. ఆ తర్వాత సాహోలో కీలక పాత్రలో కనిపించాడు అరుణ్.



Next Story