సాయంత్రం 7 గంటల వరకూ ఉంటాయి : ఎర్రబెల్లి

by  |
సాయంత్రం 7 గంటల వరకూ ఉంటాయి : ఎర్రబెల్లి
X

దిశ, వ‌రంగ‌ల్: మంత్రి కేటీఆర్ ప‌ర్య‌ట‌న‌కు ఏర్పాట్లు ముమ్మ‌ర‌ం చేశారు. ఈ నెల 17న వ‌రంగ‌ల్ లో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేయ‌నున్న నేప‌థ్యంలో కాక‌తీయ పట్ట‌ణాభివృద్ధి సంస్థ‌, గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల ఆధ్వ‌ర్యంలో ప‌క‌డ్బందీగా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఈ ఏర్పాట్ల‌ను శ‌నివారం మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు సమీక్షించారు. అనంతరం హ‌న్మ‌కొండ‌లోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 17న మంత్రి కేటీఆర్ రానున్న త‌రుణంలో ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ‌న్నారు. వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌లో మంత్రి కేటీఆర్ దాదాపు రూ.650 కోట్ల పలు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేస్తార‌న్నారు. ఆ రోజు ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 7 గంట‌ల వ‌ర‌కూ కార్య‌క్ర‌మాలుంటాయ‌ని మంత్రి వివ‌రించారు. ఆయా కార్య‌క్ర‌మాల అనంత‌రం వ‌రంగ‌ల్ న‌గ‌రం, కుడా అభివృద్ధిపై స‌మీక్ష చేస్తార‌ని మంత్రి తెలిపారు. ఈ సమీక్షలో ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య భాస్క‌ర్, ఎంపీలు బండా ప్ర‌కాశ్, ప‌సునూరి ద‌యాక‌ర్, మాజీ ఉప ముఖ్య‌మంత్రి, ఎమ్మెల్సీ క‌డియం శ్రీ‌హ‌రి, మాజీ ఉప ముఖ్య‌మంత్రి, స్టేష‌న్ ఘ‌న్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య‌, ఎమ్మెల్యేలు చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, ఆరూరి ర‌మేశ్, న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్, మేయ‌ర్ గుండా ప్ర‌కాశ్ రావు, జిల్లా క‌లెక్ట‌ర్ రాజీవ్ గాంధీ హ‌న్మంతు, పోలీస్ క‌మిష‌న‌ర్ వి. ర‌వింద‌ర్, వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప‌మేలా స‌త్ప‌తి, వ‌రంగ‌ల్ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ చింతా స‌దానందం తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed