టీఆర్ఎస్‌కు షాక్.. ఈటలకే పట్టం కట్టిన "ఆరా"

by  |
etala
X

దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ పోలింగ్ సరళిని విశ్లేషించిన ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలు ఈటల రాజేందర్ గెలుపు ఖాయమంటూ ఫలితాలను వెల్లడించాయి. తాజాగా ‘ఆరా’ అనే సంస్థ సైతం ఆయనదే విజయమంటూ విశ్లేషణాత్మక వివరాలను వివరించింది. నియోజకవర్గంలోని 18-25 ఏళ్ళ యువతలో దాదాపు 60 శాతానికి పైగా ఈటల రాజేందర్‌కే మద్దతు పలికినట్లు తేల్చింది. అరవై ఏళ్ళ లోపువారు కూడా టీఆర్ఎస్ కంటే ఈటలవైపే మొగ్గు చూపినట్లు పేర్కొన్నది. కానీ అరవై ఏళ్ళ వయసు దాటిన వృద్ధులంతా టీఆర్ఎస్‌కు అండగా నిలబడ్డారని, దాదాపు సగం మంది ఈ వయసు ఓటర్లు గులాబీ పార్టీకే ఓటు వేసినట్లు తేల్చింది. మొత్తంగా ఈటల రాజేందర్‌కు 57.15% ఓట్లు వస్తాయని, టీఆర్ఎస్‌కు కేవలం 39% ఓట్లు మాత్రమే పడతాయని, కాంగ్రెస్‌కు దాదాపు 2% ఓట్లు రావచ్చని వెల్లడించింది.

కులాలవారీగా చూస్తే ఈటల రాజేందర్ సామాజికవర్గమైన ‘ముదిరాజ్’ ఓటర్లలో దాదాపు నాల్గింట మూడొంతుల మంది ఆయనకే ఓటు వేసినట్లు పేర్కొన్నది. వైశ్యులు కూడా దాదాపు 72% మంది ఈటలకే మొగ్గు చూపారని పేర్కొన్నది. మున్నూరుకాపు, గౌడ్, పద్మశాలి కులాల ఓట్లు కూడా దాదాపు 60%కి పైగా ఆయనకే పడినట్లు తెలిపింది. కానీ ముస్లిం ఓట్లు మాత్రం బీజేపీకి కేవలం 33% పడితే టీఆర్ఎస్‌కు 54%, కాంగ్రెస్‌కు 12% పడినట్లు తేల్చింది. ‘దళితబంధు’ పథకాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినా వారి ఓట్లు ఆ పార్టీకంటే ఈటల రాజేందర్‌కే అనుకూలంగా పడినట్లు పేర్కొన్నది. టీఆర్ఎస్ వైపు 36% మంది మాలలు నిలిస్తే బీజేపీవైపు 62% మంది ఉన్నారని, మాదిగ ఓటర్లలో బీజేపీవైపు 52% ఉంటే, టీఆర్ఎస్ వైపు 43% ఉన్నారని, దాదాపు 5% కా,గ్రెస్ వైపు ఉన్నట్లు ‘ఆరా’ తన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో పేర్కొన్నది.

Next Story

Most Viewed