ఐఫోన్‌తో.. కారులో ఏసీ, రేడీయో, సీట్స్ నియంత్రణ.. ఎలా అంటే ?

by  |
ఐఫోన్‌తో.. కారులో ఏసీ, రేడీయో, సీట్స్ నియంత్రణ.. ఎలా అంటే ?
X

దిశ, ఫీచర్స్ : ఆపిల్ కంపెనీ ‘కార్‌ప్లే’ ఇంటర్‌ఫేస్‌ను మిలియన్ల మంది వాహనదారులు సంగీతాన్ని నియంత్రించడానికి, డైరెక్షన్స్ పొందడానికి, ఫోన్ కాల్ చేయడానికి ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. కార్లలో దాని పరిధిని విస్తరించాలని ఆపిల్ ప్రయత్నిస్తోంది. క్లైమేట్-కంట్రోల్ సిస్టమ్, స్పీడోమీటర్, రేడియో, కార్ సీట్ల వంటి ఫంక్షన్‌లను యాక్సెస్ చేసే సాంకేతికతపై పనిచేస్తోంది.

ఆపిల్ కంపెనీ కార్‌ప్లేతో దూసుకుపోతూనే ఉంది. ఈ క్రమంలోనే ఇన్ఫోటైన్‌మెంట్ ఫీచర్స్ నిర్వహించడానికి కస్టమర్లు తమ ఐఫోన్‌లను ఒక వాహనంతో లింక్ చేయడానికి అనుమతిస్తుంది. దీన్ని మరింత విస్తరించాలని భావించిన ఆపిల్ కంపెనీ, కొత్త ఫీచర్లను జోడిస్తుంది. కొత్త రకాల యాప్‌లను సృష్టించడానికి లేదా ఇప్పటికే ఉన్న ఫంక్షన్‌లకు ఫీచర్‌లను జోడించడానికి డేటాను ఆపిల్ లేదా థర్డ్ పార్టీలు కూడా ఉపయోగించవచ్చని తెలిపింది. కార్ ప్లే అచ్చంగా హోమ్, హెల్త్ యాప్‌వలె పనిచేస్తాయి. ఆపిల్ కంపెనీ ఇప్పటికే తన హెల్త్‌కిట్ ప్రోటోకాల్‌ని ఉపయోగించి ఎక్స్‌టర్నల్ హెల్త్ డివైజ్ నుంచి డేటాను యాక్సెస్ చేయగల, సమీకరించగల ‘హెల్త్ యాప్’ను ఐఫోన్‌లో అందిస్తుంది.

అదే సమయంలో థర్మోస్టాట్లు, సెక్యూరిటీ కెమెరాలు, డోర్ లాక్‌లతో సహా స్మార్ట్ ఉపకరణాలను నియంత్రించడానికి ఆపిల్ హోమ్‌కిట్ సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది. కార్‌ప్లే ఇప్పుడు 600 కంటే ఎక్కువ కార్ల మోడళ్లలో ఉంది. 2015లో, కార్ రేడియో, GPS, వాతావరణ నియంత్రణలను యాక్సెస్ చేయగల కార్‌ప్లే కోసం థర్డ్ పార్టీ యాప్‌లను రూపొందించడానికి ఆపిల్ కార్ల తయారీదారులను అనుమతించడం ప్రారంభించింది. 2019లో ఇది డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ల వంటి సెకండరీ కార్ స్క్రీన్‌లపై కార్‌ప్లేకి మద్దతు ఇవ్వడం ప్రారంభించింది. ఒక సంవత్సరం తర్వాత ఐఫోన్ లేదా ఆపిల్ వాచ్‌తో కారును అన్‌లాక్ చేసే ఫీచర్ కార్కీ , ఎలక్ట్రిక్-వెహికల్ రూటింగ్ వంటి ఫీచర్స్ అందించింది.

ఫీచర్స్

* లోపలి, వెలుపల ఉష్ణోగ్రత, తేమ రీడింగులు
* ఉష్ణోగ్రత మండలాలు, ఫ్యాన్లు, డీఫ్రాస్టర్ వ్యవస్థలు
* సరౌండ్-సౌండ్ స్పీకర్లు, ఈక్వలైజర్‌లు, ట్వీటర్లు, సబ్ వూఫర్లు, ఫేడ్ అండ్ బ్యాలెన్స్‌లను సర్దుబాటు చేయడానికి సెట్టింగ్స్
* సీట్లు, ఆర్మ్‌రెస్ట్‌ల అడ్జస్ట్‌మెంట్
* స్పీడోమీటర్, టాకోమీటర్, ఇంధన పరికరాల క్లస్టర్‌లు

Next Story

Most Viewed