అపోలో డయాగ్నోస్టిక్స్ కొవిడ్ ఆర్‌టీ‌పీ‌సీఆర్ పరీక్ష ఇక మీ చెంతకే!

by  |
అపోలో డయాగ్నోస్టిక్స్ కొవిడ్ ఆర్‌టీ‌పీ‌సీఆర్ పరీక్ష ఇక మీ చెంతకే!
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్ : అపోలో డయాగ్నోస్టిక్స్, అపోలో హెల్త్, లైఫ్ స్టైల్ ప్రైవేట్ లిమిటెడ్ గురువారం జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ఐసీఎంఆర్ ఆమోదించిన కొవిడ్ ఆర్‌టీ‌పీ‌సీఆర్ ‘డ్రైవ్ త్రూ’ పరీక్షను ప్రారంభించింది. రోజుకు 250 మంది రోగులకు టెస్ట్ లను నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని ఆ సంస్థ ప్రకటించింది. దీంతో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, షేక్‌పేట్, ఫిల్మ్ నగర్, అత్తాపూర్ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని తెలిపింది.

ఈ మేరకు సంస్థ స్ట్రాటజీ అండ్ న్యూ ఇనిషియేటివ్స్, ఆపరేషన్స్, అపోలో డయాగ్నోస్టిక్స్ విశ్వజిత్ రెడ్డి కొండా వివరాలు వెల్లడించారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న సమయంలో ప్రజలు ఆర్‌టీ‌పీ‌సీఆర్ పరీక్షా కేంద్రాల కోసం ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అయితే ఈ కేంద్రాలు నిర్దిష్ట సమయాలలో పరీక్షను నిర్వహించి తేలికగా నిర్ధారించడానికి తమ సంస్థ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్‌లో పరీక్ష ద్వారా ఈ వినూత్న డ్రైవ్‌ను ప్రారంభించిందని చెప్పారు. నగరంలోని వివిధ ప్రదేశాలలో ఇలాంటి మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆర్‌టీ‌పీ‌సీఆర్ పరీక్ష చేయించుకోవాలనుకునే వారు ఈ సులభమైన, సురక్షితమైన 5 దశల విధానాన్ని అనుసరించాల్సి ఉంటుందన్నారు.

క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడంతో ప్రవేశద్వారం వద్ద రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడం. తద్వారా వారి మొబైల్‌లో టోకెన్ నంబర్‌ను ఇవ్వబడుతుందన్నారు. ఇందుకు వారు ఆన్‌లైన్‌లో అవసరమైన చెల్లింపు చేస్తే వారిన నుండి నమూనాను సేకరించడం జరుగుతుందన్నారు. పరీక్ష ఫలితాలు డిజిటల్ ఇన్వాయిస్ ఉన్న సందేశం మొబైల్‌లో అందుతుందని, 48-72 గంటల వ్యవధిలో వారికి రిపోర్టుల సమాచారం అందించబడుతుందన్నారు. అయితే ప్రభుత్వంచే జారీ చేయబడిన గుర్తింపు పత్రాలను తప్పనిసరి వెంట ఉంచుకోవాలని సూచించారు.

మరింత సమాచారం కోసం అపోలో డయాగ్నోస్టిక్స్ కస్టమర్ కేర్‌ను
040-44442424 , 9959154371 / 9963980259 నెంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు .



Next Story

Most Viewed