The Rapist: ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘ది రేపిస్ట్’

by  |
The Rapist: ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘ది రేపిస్ట్’
X

దిశ, సినిమా : ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్, స్క్రీన్ రైటర్, యాక్ట్రెస్ అపర్ణా సేన్ రూపొందించిన ‘ది రేపిస్ట్’ మూవీ.. బూసన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(BIFF) 26వ ఎడిషన్‌లో వరల్డ్ ప్రీమియర్‌కు ఎంపికైంది. ఈ చిత్రాన్ని క్వెస్ట్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. ఏసియన్ సినిమా సెక్షన్‌లోని ‘ఏ’ విండోలో ప్రీమియర్ అవుతున్న సినిమా ‘కిమ్ జోసియోక్ అవార్డు’ కోసం నామినేషన్‌ పొందింది. సెర్మనీ ముగింపు సందర్భంగా ఈ అవార్డును ప్రకటిస్తారు.

ఒక భయంకరమైన సంఘటనతో ముడిపడ్డ ముగ్గురు వ్యక్తుల జీవితాలను ‘ది రేపిస్ట్’ వివరిస్తుంది. నేరానికి పాల్పడినవారితో పాటు నేరస్తులను ఎలా ప్రభావితం చేస్తుందో అన్వేషించే ప్రయత్నం చేసింది. అలాగే నిజం అసౌకర్యంగా అనిపించినపుడు ఒకరి ఆదర్శవాద అభిప్రాయాలు ఎలా తీవ్రంగా మారిపోతాయో కూడా ఈ చిత్రం విశ్లేషిస్తుంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ ‘మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్’ వంటి ప్రశంసాత్మక చిత్రాల తర్వాత టాలెంటెడ్ తల్లీకూతుళ్లు అపర్ణా సేన్, కొంకణా సేన్ శర్మ కలిసి ‘ది రేపిస్ట్’కు పనిచేశారు. ఇందులో అర్జున్ రాంపాల్‌, తన్మయ్ ధనానియా కూడా కీలక పాత్రలు పోషించారు. కాగా ‘సొసైటీలో పలువురు రేపిస్టులుగా మారడానికి గల కారణాల అన్వేషణ, సామాజిక వ్యవస్థలోని అసమానతలను పరిశీలించడమే కాక ముగ్గురు కథానాయకుల సైకాలజీ నన్ను ఈ కథ పట్ల అట్రాక్ట్ చేసింది’ అని అపర్ణా సేన్ వెల్లడించింది.


Next Story