రికార్డు సృష్టించిన ఏపీ సర్కార్.. 2 కోట్లు దాటిన కరోనా పరీక్షలు

by  |
రికార్డు సృష్టించిన ఏపీ సర్కార్.. 2 కోట్లు దాటిన కరోనా పరీక్షలు
X

దిశ, ఏపీ బ్యూరో: కరోనా నియంత్రణలో భాగంగా ఏపీ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించి సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. ఇదే అంశంపై అమరావతిలో బుధవారం ఏపీ వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ఏకే సింఘాల్ మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ ఆదేశాలతో కరోనా నిర్ధారణ పరీక్షలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందికిపైగా కరోనా పరీక్షలు నిర్వహించామని ఇదొక రికార్డు అని అభిప్రాయపడ్డారు. మే 16న పాజిటివిటీ రేటు 25.56% ఉండగా ప్రస్తుతం 9.37%గా ఉందని చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు ఏకే సింఘాల్ స్పష్టం చేశారు. రోజు రోజుకు యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయన్నారు. రెట్టింపు స్థాయిలో పాజిటివ్‌ రేటు తగ్గిందని స్పష్టం చేశారు. మరోవైపు వ్యాక్సినేషన్‌లోనూ రికార్డులు సృష్టించనున్నట్లు చెప్పుకొచ్చారు. జూలై 10నాటికి ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు టీకా మొదటి డోస్‌ పూర్తి చేస్తామని ఏకే సింఘాల్‌ ప్రకటించారు.



Next Story

Most Viewed