‘‘ప్లీజ్ నేను ఇండియాకు వచ్చేస్తా’’…

by  |
‘‘ప్లీజ్ నేను ఇండియాకు వచ్చేస్తా’’…
X

రోనా వైరస్‌తో అతలాకుతలం అయిన చైనా దేశంలో తెలుగమ్మాయి చిక్కుకుంది. ‘‘ప్లీజ్ నేను ఇండియాకు వచ్చేస్తా… ఏడు రోజులుగా భారత్‌కు రావాలని చూస్తున్నా, కానీ ఇక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు, నాకు ఎటువంటి వైరస్ లేదు, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, వైద్య సేవలు కూడా అందించడం లేదని’’ జ్యోతి వేడుకుటోంది. తనను రక్షించాలని సెల్ఫీ వీడియోను పెట్టింది. దీంతో వెంటనే తన కూతురును స్వదేశానికి రప్పించాలని కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కూతురు సురక్షితంగా రావాలని జ్యోతి తల్లి ప్రమీళ మహానందిలో ప్రత్యేక పూజలు చేస్తోంది. జ్యోతికి కరోనా వైరస్ ఉందనే అనుమానంతో కేంద్రం ఆమెను అక్కడే కుటుంబ సభ్యలు మరింత ఆందోళన చెందుతున్నారు. పిబ్రవరి 19న జ్యోతి వీసా గడువు ముగుస్తుందని, తనను వెంటనే రక్షించి ఇండియాకు రప్పించాలని తనకు కాబోయే భర్త అమర్‌నాథ్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాడు.
జ్యోతిని తీసుకురావడానికి ప్రభుత్వం నుంచి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఏపీ మంత్రి బుగ్గ రాజేంద్రనాథ్ అన్నారు. జ్యోతి కోసం ఇండియన్ ఎంబసీని సంప్రదిస్తున్నామని, గ్లోబల్ హెల్త్ ఇష్యూ కావడంతో ఆమె అక్కడే ఆగాల్సి వచ్చిందని, త్వరలోనే జ్యోతి నంద్యాలకు చేరుకుంటుందని కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ అన్నారు.
జ్యోతిని స్వదేశానికి తీసుకురావడం కోసం ఎంపీ బ్రహ్మానందరెడ్డి విదేశాంగా మంత్రిత్వశాఖను కలిసి వినతిపత్రం సమర్పించారు. జ్యోతిని రప్పించేందుకు ప్రయత్నిస్తున్నానని మాజీ మంత్రి అఖిలప్రియ తెలిపింది. కేంద్రమంత్రి కిషన్‌‌రెడ్డిని కూడా సంప్రదించానన్నారు. జ్యోతి స్వస్థలం కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామం.

Next Story