ఫేక్‌న్యూస్‌లు సమస్యాత్మకంగా మారుతున్నాయి: డీజీపీ

by  |
ఫేక్‌న్యూస్‌లు సమస్యాత్మకంగా మారుతున్నాయి: డీజీపీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆలయాలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, కావాలనే కొందరు వక్రీకరిస్తున్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఏపీలో విగ్రహాల ధ్వంసంపై బుధవారం ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించి మాట్లాడారు. ఫేక్‌న్యూస్‌లు కొన్నిసార్లు సమస్యాత్మకంగా మారుతున్నాయని, దేవాలయాలు, విగ్రహాల ధ్వంసంపై 44 కేసులు నమోదు చేశామన్నారు. పోలీసులకు కులం, మతం ఆపాదించడం సరికాదన్న డీజీపీ.. నా 35 ఏళ్ల సర్వీసులో ఇలాంటి ఆరోపణలు వినలేదని, దేశసమగ్రతను కాపాడటంలో పోలీసులు అంకిత భావంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. 58,871 హిందూ దేవాలయాలకు జియో ట్యాగింగ్ చేశామని, రాష్ట్రంలో కొత్తగా 14,824 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. రామతీర్థం ప్రధాన ఆలయంలోని విగ్రహం ధ్వంసం కాలేదని, గుట్టపై ఉన్న విగ్రహాన్నే ధ్వంసం చేశారని డీజీపీ తెలిపారు.


Next Story

Most Viewed