డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు : 2014 ఎన్నికల్లో తప్పు చేశాం లేకుంటే..

by  |
డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు : 2014 ఎన్నికల్లో తప్పు చేశాం లేకుంటే..
X

దిశ, ఏపీ బ్యూరో : నామినేటెడ్ పోస్టుల కేటాయింపులపై ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ హర్షం వ్యక్తం చేశారు. ఎవరి సిఫార్సులు లేకుండా నామినేటెడ్ పోస్టులు కేటాయించారని అభిప్రాయపడ్డారు. తన సిఫారసులతో కొందరికి నామినేటెడ్ పోస్టులు దక్కాయంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. తాను ఎవరినీ సిఫారసు చేయలేదన్నారు. పార్టీ కోసం కషపడిన ప్రతీ ఒక్కరికీ సముచిత స్థానం కల్పించారన్నారు. రికమండేషన్లతో పదవులు రావని.. పార్టీకోసం కష్టపడిన వాళ్లకే పదవులని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ సమర్థతను ఎవరూ తక్కువగా అంచనా వేయోద్దన్నారు. అత్యంత సమర్థవంతమైన వ్యక్తి జగన్ అని కొనియాడారు.

సామాజిక న్యాయం చేయడంలో జగన్ తర్వాతే ఎవరైనా అని చెప్పుకొచ్చారు. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని చంద్రబాబు అంటే.. ఒక ఎస్సీ మహిళను జగన్ హోంమంత్రిని చేశారని గుర్తు చేశారు. పదవులు దక్కలేదని ఎవరూ అసూయ పడొద్దని డిప్యూటీ సీఎం హితవు పలికారు. పార్టీని మరింత బలోపేతం చేసి జగన్‌కు అండగా నిలవాలని కోరారు. తమలో లోపాలుంటే ఎత్తి చూపాలని ప్రతిపక్షాలను కోరుతున్నామని ధర్మాన తెలిపారు. 2014 ఎన్నికల్లో మనం తప్పు చేశామన్నారు. ఆరోజే జగన్‌ను గెలిపించి ఉంటే ఈ రాష్ట్రం మరో ఐదేళ్లు అభివృద్ధిలో ఉండుండేదని చెప్పుకొచ్చారు. గతంలో గ్రూపులు, వర్గాలుండేవని కానీ నేడు జగన్ ఒక్కడే నాయకుడని ఎలాంటి గ్రూపులు లేవన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ , ఎంపీ స్థానాన్ని కూడా కైవసం చేసుకునేలా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed