జగన్ కీలక నిర్ణయం.. ఆ కాలేజీలకు షాక్

by  |
ys jagan
X

దిశ, వెబ్ డెస్క్: విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అటానమస్‌ కాలేజీల్లో పరీక్షా విధానం, జగనన్న విద్యాదీవెన పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యారంగం సంస్కరణల్లో భాగంగా అటానమస్‌ కాలేజీల్లో పరీక్షల విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. అటానమస్‌ కాలేజీలే సొంతంగా ప్రశ్నపత్నాలు తయారు చేసుకునే విధానాన్ని రద్దు చేసింది. అన్ని కాలేజీలకు జేఎన్‌టీయూ తయారుచేసిన ప్రశ్నపత్రాలే వస్తాయని తెలిపింది.

అటానమస్, నాన్‌ అటానమస్‌ కాలేజీలకు ఇవే ప్రశ్నపత్నాలు వర్తిస్తాయని తెలిపింది. ప్రశ్నపత్రాల వాల్యూయేషన్‌ కూడా జేఎన్‌టీయూకే అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. పరీక్షల్లో అక్రమాల నిరోధానికే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. అలాగే డిగ్రీలు సాధించిన తర్వాత ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. నైపుణ్యం లేకుండా ఇంటర్వ్యూలు కూడా ఎదుర్కోం లేమని జగన్ సమీక్షలో తెలిపారు. ప్రతి విద్యార్థీ నైపుణ్యంతో, సబ్జెక్టుల్లో పరిజ్ఞానంతో ముందుకు రావాలని.. అలాగే ప్రతికోర్సుల్లో అప్రెంటిస్‌ విధానం తీసుకురావాలని నిర్ణయించినట్లు జగన్ తెలిపారు.

కనీస అనుభవం, పరిజ్ఞానం లేని డిగ్రీలకు విలువ ఏముంటుందని ప్రశ్నించారు. విద్యార్థులు తాము చదువుతున్న కోర్సుల్లో నచ్చిన సబ్జెక్టులను ఎంపిక చేసుకునే అవకాశం ఉండాలని ఆకాంక్షించారు. కొత్త కొత్త సబ్జెక్టులను వారికి అందుబాటులో ఉంచాలని.. అలాగే అభివృద్ధి చెందిన దేశాల్లో డిగ్రీ విద్యావిధానాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. విశాఖపట్నంలో మంచి డిగ్రీ కాలేజీ తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. ఆర్ట్స్‌లో మంచి సబ్జెక్టులను ఈ కాలేజీలో ప్రవేశపెట్టాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.


Next Story

Most Viewed