ఏపీ బాలికలకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. ఏంటంటే ?

by  |
cm jagan
X

దిశ, ఏపీ బ్యూరో: బాలికల ఆరోగ్య రక్షణ, విద్యకు విఘాతం లేకుండా ఉండేందుకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్స్ పంపిణీ చేయాలని సీఎం జగన్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. స్వేచ్ఛ కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లలకు శానిటరీ న్యాప్‌కిన్స్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అక్టోబర్ రెండో వారంలో ఈ కార్యక్రమం ప్రారంభించాలని సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ‘ నెలసరి సమస్యల విషయంలో స్కూల్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఆ సమస్యతో చాలామంది అమ్మాయిలు స్కూళ్లకు వెళ్లలేక ఇంటికి పరిమితం అవుతారు. ప్రధానంగా ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో అలాంటి విద్యార్థుల కోసం స్కూళ్లలో శానిటరీ న్యాప్‌కీన్స్ అందజేయాలి. ప్రభుత్వ స్కూళ్లు, పాఠశాలల్లో చదువుతున్న 12-18 ఏళ్ల విద్యార్ధినులకు ప్రభుత్వం ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్స్ అందించాలి’ అని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ విద్యాసంస్థల్లో కౌమార దశ బాలికలు 12.50 లక్షలున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. వీరందరికీ న్యాప్‌కిన్స్ కొనుగోలుకు రూ. 41.4 కోట్లు ఖర్చు అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.


Next Story

Most Viewed