ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ

65

దిశ, వెబ్‌డెస్క్: నేడు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ కేబినెట్ మీటింగ్‌లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నారు. స్టీల్ ప్లాంట్ అంశంకై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మార్చి 4వ తేదీన సదరన్ కౌన్సిల్‌లో లేవనెత్తాల్సిన అంశంపై చర్చించనున్నట్లు సమాచారం. పట్టణాల్లో రూరల్ క్లినిక్స్ తరహాలో క్లినిక్‌ల ఏర్పాటుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అర్బన్ హౌసింగ్ టిడ్కో ఇళ్లపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..