మరో సిరీస్‌తో పలకరించనున్న అనుష్క

by  |
మరో సిరీస్‌తో పలకరించనున్న అనుష్క
X

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ నిర్మాణరంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. సోదరుడితో కలిసి ‘క్లీన్ స్లేట్ ఫిల్మ్స్’ సంస్థను స్థాపించిన అనుష్క తొలి వెబ్ సిరీస్ ‘పాతాళ్ లోక్‌’తో సక్సెస్ అందుకుంది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమైన పాతాళ్ లోక్‌లో గూర్ఖాలను కించపరిచారంటూ విమర్శలు కూడా వచ్చాయి. కానీ, అవన్నీ లైట్ తీసుకున్న అనుష్క ఇప్పుడు నిర్మాతగా మరో సిరీస్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమైంది. ‘బుల్ బుల్’ పేరుతో రూపుదిద్దుకున్న నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ నుంచి టీజర్ రిలీజ్ చేసింది అనుష్క. ‘స్వీయ ఆవిష్కరణ, న్యాయం, కుట్రలతో కూడిన అద్భుతకథ బుల్ బుల్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో టీజర్ షేర్ చేయగా విపరీతంగా ఆకట్టుకుంటోంది.

బుల్ బుల్.. అనే అమ్మాయి గ్రామ ప్రజలకు సర్వ్ చేస్తూ ఉంటుంది. కానీ, అదే టైమ్‌లో గ్రామంలోనే మరో తెలియని స్త్రీ వల్ల చాలా ఇబ్బందులకు గురవుతుంటుంది. ఇంతకీ ఆ మహిళ ఎవరు? సత్య అనే వ్యక్తికి బుల్‌బుల్‌కు సంబంధం ఏంటి.. సత్య సోదరుడు బుల్‌బుల్‌కు చేసిన అన్యాయం ఏంటి? ఆ అపరిచితురాలిని సత్య ఎలా కనుగొన్నాడు? అనేది కథ. కాగా అన్వితాదత్ డైరెక్షన్‌లో వస్తున్న బుల్‌బుల్ సిరీస్‌లో అవినాష్ తివారి, త్రిపాఠి దిమ్రి, రాహుల్ బోస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.


Next Story

Most Viewed