Viveka Murder Case: సుప్రీంకోర్టులో ఎంపీ అవినాశ్ రెడ్డికి ఊరట

by Disha Web Desk 16 |
Viveka Murder Case: సుప్రీంకోర్టులో ఎంపీ అవినాశ్ రెడ్డికి ఊరట
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ఆర్ కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఈనెల 25 వరకు ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేమొద్దంటూ సీబీఐను తెలంగాణ హైకోర్టును ఆదేశించిన సంగతి తెలిసిందే. తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం సోమవారం వరకు ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ స్పష్టం చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

టీ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వివేకా కుమార్తె

కాగా మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి మధ్యంతర బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ నెల 25 వరకు అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించింది. తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తే అవినాశ్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేస్తారని ఎంపీ అవినాశ్ రెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. ఈ కేసుకు సంబంధించి పేపర్ బుక్ కూడా తమ వద్ద లేదని వాదించారు. వైఎస్ సునీతారెడ్డి పిటిషన్‌లో ఏముందో కూడా తమకు తెలియదని ఎంపీ అవినాశ్ రెడ్డి తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో వాదించారు. పేపర్ బుక్ తమ వద్ద ఉంటే వాదనలు వినిపించేవాళ్లమని అయితే లేని నేపథ్యంలో తమ వాదనలు వినిపించేందుకు సోమవారం వరకు గడువు ఇవ్వాల్సిందిగా కోరారు.

విచారణ సోమవారానికి వాయిదా

దీంతో సోమవారం వరకు అవినాశ్‌ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు సోమవారం వరకు ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను సోమవారంకు వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి: Avinashreddy: నేడు ముగిసినా.. రేపటి విచారణపై క్లారిటీ ఇవ్వని సీబీఐ

Next Story

Most Viewed