క్రైస్తవులంతా ఏకమై జగన్ ను గెలిపియండి.. వైఎస్ చెల్లెలు వీడియో వైరల్ !

by velandi.Saikiran |

క్రైస్తవులు ( Christians ) అంతా ఏకమై... జగన్మోహన్ రెడ్డిని ( Jagan Mohan Reddy ) మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని వైయస్

క్రైస్తవులంతా ఏకమై జగన్ ను గెలిపియండి.. వైఎస్ చెల్లెలు వీడియో వైరల్ !
X

దిశ, వెబ్ డెస్క్ : క్రైస్తవులు ( Christians ) అంతా ఏకమై... జగన్మోహన్ రెడ్డిని ( Jagan Mohan Reddy ) మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని వైయస్ రాజశేఖర్ రెడ్డి ( YSR ) సోదరి వైయక్రైస్తవులు ( Christians ) అంతా ఏకమై... జగన్మోహన్ రెడ్డిని ( Jagan Mohan Reddy ) మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని వైయస్ రాజశేఖర్ రెడ్డి ( YSR ) సోదరి వైయస్ విమలా రెడ్డి ( YS Vimala Reddy) సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా క్రైస్తవుల సమావేశంలో వైయస్ విమలా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... వేలాది సంఖ్యలో క్రైస్తవులు అక్కడికి వచ్చారు. ఈ ఈవెంట్ కడపలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా వైయస్ విమాలా రెడ్డి మాట్లాడుతూ... వైయస్ జగన్మోహన్ రెడ్డికి శత్రువులు ఎక్కువ అయ్యారని ఆమె తెలిపారు. ఇప్పుడు ఒంటరివాడయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు.


కాబట్టి ఇలాంటి సమయంలో... క్రైస్తవులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. మనం అందరం ఏకమై.. జగన్ మోహన్ రెడ్డిని ( Jagan Mohan Reddy ) ముఖ్యమంత్రి చేసుకోవాలని.. వైసీపీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికలలోపు అందరూ ఏకం కావాలని కోరారు. క్రైస్తవులంతా ఏకమైతే సాధించలేనిది... ఏదీ లేదంటూ.. పాస్టర్ రేంజ్ లో వైఎస్ విమలా రెడ్డి స్పీచ్ ఇచ్చారు. అయితే వైయస్ విమలా రెడ్డి.. ఏ రోజున ఈ వ్యాఖ్యలు చేశారో తెలియాల్సి ఉంది. కానీ ఆమెకు సంబంధించిన వీడియో జనసేన పార్టీ సోషల్ మీడియాలో... వైరల్ అవుతుంది. జగన్ కుటుంబ సభ్యులు కూడా క్రైస్తవులను రెచ్చగొడుతున్నారని కామెంట్స్ చేస్తూ... వైయస్ విమలారెడ్డి వీడియోని వైరల్ చేస్తున్నారు జనసేన సైనికులు.


Next Story